Retail ownership in NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆల్ టైం గరిష్ఠానికి చేరిన రిటైల్ ఓనర్షిప్ కంపెనీలు 

ప్రతీకాత్మక చిత్రం

ఎమర్జింగ్ మార్కెట్లో మార్చి చివరి వరకు ఇతర గేజ్‌ల కంటే వెనుకబడి ఉన్న భారతీయ బెంచ్ మార్కులు, జూన్ త్రైమాసికంలో అధిక విలువల కంటే మెరుగ్గా పనిచేశాయి.

  • Share this:
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)లో నమోదైన రిటైల్ ఓనర్షిప్ కంపెనీలు సంఖ్య జూన్ త్రైమాసికంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకుంది. విస్తృతమైన బెంచ్ మార్క్ ఇండీసెస్ కోసం నిరంతర లాభాలు అందుకుంటోన్న సమయంలో.. క్యాపిటల్ మార్కెట్లో వ్యక్తిగత పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగింది. భారత్‌లో అతిపెద్ద ఈక్వీటి గేజ్‌లు వరుసగా మూడో రోజైన గురువారం కూడా అత్యుత్తమ శిఖరాలకు చేరాయి. కొన్ని డిఫెన్సివ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరిగాయి. నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 0.2 శాతం పెరిగి 16,294, 54,492 పాయింట్లకు చేరుకున్నాయి. జూన్ 30 నాటికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రిటైల్ పెట్టుబడిదారుల వాటా 7.18 శాతంగా ఉంది. ఇది మార్చిలో 6.96 శాతానికి చేరగా.. ఐదేళ్ల క్రితం 6.89 శాతం కంటే మెరుగ్గా ఉంది. 2009 జూన్ రికార్డు 7.10 శాతాన్ని ప్రస్తుతం అధిగమించింది.

మొదటి త్రైమాసికంలో నూతన రిటైల్ పెట్టుబడిదారులు..
కచ్చితంగా చెప్పాలంటే భారత స్టాక్స్‌లో డొమెస్టిక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(డీఐఐ) యాజమాన్యం 11-త్రైమాసికాల కనిష్ఠానికి క్షీణించింది. ఉధృతంగా ఉన్న సెకండరీ మార్కెట్, నూతన లిస్టింగులు రిటైల్ సేవింగ్స్‌ను క్యాపిటల్ మార్కెట్లోకి మార్చేందుకు సహాయపడ్డాయి. ఈ ధోరణులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడానికి వ్యక్తిగత పెట్టుబడిదారుల ప్రాధాన్యతను చూపుతాయి.

ఎమర్జింగ్ మార్కెట్లో మార్చి చివరి వరకు ఇతర గేజ్‌ల కంటే వెనుకబడి ఉన్న భారతీయ బెంచ్ మార్కులు, జూన్ త్రైమాసికంలో అధిక విలువల కంటే మెరుగ్గా పనిచేశాయి. ప్రధానంగా రిటైల్ పార్టిసిపేషన్ మొత్తం క్యాష్ మార్కెట్ టర్నోవర్‌లో 73 శాతానికి పెంచాయి. జనవరి, మార్చి కంటే జులైలో నిఫ్టీ సూచి 4.8 శాతం పెరిగింది. అప్పటి నుంచి 10 శాతం పుంజుకుంది. విలువపరంగా జూన్ 30న రిటైల్ హోల్డింగ్ రూ.16.18 కోట్లుగా ఉంది. గత త్రైమాసికంలో 16.07 శాతం పెరిగింది. స్టాక్‌కు సంబంధించి ఫ్రీ ఫ్లోట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. రిటైల్ యాజమాన్యం మార్చి త్రైమాసికంలో 13.86 శాతం నుంచి జూన్ త్రైమాసికానికి 14.49 శాతానికి చేరుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య కాలంలో భారత్‌లో అదనంగా 5 మిలియన్లకు పైగా నూతన పెట్టుబడిదారులు వచ్చారు. వీరిలో 53 శాతం మంది అత్యధిక ఇన్వెస్టర్ బేసెస్‌ను కలిగి ఉన్న టాప్ 5 స్థానాలను మించి ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎన్ఎస్ఈలో నమోదు చేసుకున్న పెట్టుబడిదారుల సంఖ్య 45 మిలియన్లు దాటింది. 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో 23.6 మిలియన్ల మంది కొత్తగా డీమ్యాట్ ఖాతాలను ఓపెన్ చేశారు.
Published by:Sumanth Kanukula
First published: