హోమ్ /వార్తలు /బిజినెస్ /

Inflation: సామాన్యులకు భారీ ఊరట.. 11 నెలల కనిష్టానికి పడిపోయిన..

Inflation: సామాన్యులకు భారీ ఊరట.. 11 నెలల కనిష్టానికి పడిపోయిన..

 Inflation: సామాన్యులకు భారీ ఊరట.. 11 నెలల కనిష్టానికి పడిపోయిన..

Inflation: సామాన్యులకు భారీ ఊరట.. 11 నెలల కనిష్టానికి పడిపోయిన..

RBI | సామాన్యులకు తీపికబురు. ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. 11 నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల సీపీఐ అంచనాల కన్నా ఎక్కువగానే పడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Price Down | సామాన్యులకు ఊరట. కొత్త ఏడాది ముందు ప్రజలకు తీపికబురు అందింది. రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 11 నెలల కనిష్టానికి పడిపోయింది. నవంబర్ నెలలో ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదు అయ్యింది. అక్టోబర్ నెలలో సీపీఐ 6.77 శాతంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కమొడిటీ ధరలు (Price) దిగిరావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) టార్గెట్ లోపలికి ద్రవ్యోల్బణం దిగిరావడ గమనార్హం. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 2 నుంచి 6 శాతంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా కొనసాగించాలని ఆర్‌బీఐని కోరింది. దీనికి మార్జిన్ 2 శాతం. అంటే 4 శాతానికి అదనంగా 2 శాతం అటుఇటుగా ద్రవ్యోల్బణం ఉండొచ్చు. 2026 నాటికి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 4.67 శాతంగా నమోదు అయ్యింది. సీపీఐ బాస్కెట్‌లో దీని వాటా సగం వరకు ఉంటుంది. అక్టోబర్ నెలలో ఇది 7.01 శాతంగా ఉండటం గమనార్హం.

కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్.. కొత్త ఏడాదికి ముందు ఝలక్!

సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గడం సానుకూల అంశం అని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అనుకోకుండా 6 శాతం దిగువకు పడిపోయిందని పేర్కొన్నారు. ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆహార ద్రవ్యోల్బణం దిగిరావడం పెద్ద సానుకూల అంశం. మరోవైపు కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఎకనమిస్ట్ సువోదీప్ రక్సిత్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం 5.9 శాతానికి తగ్గడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గినా కూడా కోర్ ద్రవ్యోల్బణం మాత్రం 6 శాతానికి పైనే ఉందని పేర్కొన్నారు.

బంపర్ బొనాంజా.. కస్టమర్లకు ఒకేసారి 4 బ్యాంకుల శుభవార్త!

2023 ఫిబ్రవరి వరకు ద్రవ్యోల్బణం దాదాపు 6 శాతం సమీపంలోనే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. మార్చి నాటికి 5 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు. తర్వాత ద్రవ్యోల్బణం 4.5 శాతానికి దిగి వస్తుందని అంచనా వేశారు.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంపు వల్ల కూడా ప్రభావం కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ ఈ ఏడాది 225 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచేసింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఇటీవల కూడా రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి మాత్రం నిరాశ పరిచింది. ఐఐపీ అక్టోబర్ నెలలో 4 శాతం మేర తగ్గింది. అంచనాల కన్నా ఎక్కువగానే ఐఐపీ పడిపోవడం శోచనీయం.

First published:

Tags: Inflation, Money, Price Hike, Price reduced

ఉత్తమ కథలు