హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rs 20,000 Fine: పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది... రూ.20,000 ఫైన్

Rs 20,000 Fine: పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది... రూ.20,000 ఫైన్

Rs 20,000 Fine: పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది... రూ.20,000 ఫైన్
(ప్రతీకాత్మక చిత్రం)

Rs 20,000 Fine: పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది... రూ.20,000 ఫైన్ (ప్రతీకాత్మక చిత్రం)

Rs 20,000 Fine | ఓ శాకాహార కుటుంబం జొమాటోలో మటర్ పన్నీర్ కర్రీ (Matar Paneer Curry) ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది. దీంతో కన్స్యూమర్ ఫోరమ్ ఆ రెస్టారెంట్‌కు రూ.20,000 జరిమానా విధించింది.

ఓ రెస్టారెంట్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల భారీ ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. కస్టమర్ మట్టర్ పన్నీర్ (Matar Paneer) ఆర్డర్ చేస్తే చికెన్ కర్రీ పంపించారు. ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీకి ఈ అనుభవం ఎదురుకావడంతో వ్యవహారం కన్స్యూమర్ ఫోరమ్ (Consumer Forum) వరకు వెళ్లింది. దీంతో కన్స్యూమర్ ఫోరమ్ సదరు రెస్టారెంట్‌కు రూ.20,000 ఫైన్ వేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఘటన ఇది. జివాజీ క్లబ్ రెస్టారెంట్ నుంచి వెజిటేరియన్ ఫ్యామిలీ మట్టర్ పన్నీర్ కర్రీ తెప్పించుకోవాలనుకున్నారు. జొమాటోలో ఆర్డర్ ప్లేస్ చేశారు. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటీవ్ కాసేపట్లో ఫుడ్ పార్శిల్ తీసుకొని వచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మటర్ పన్నీర్ కర్రీ లేదు. చికెన్ కర్రీ కనిపించడంతో ఖంగుతిన్నారు.

జివాజీ క్లబ్ మెంబర్, అడ్వకేట్ అయిన సిద్దార్థ శ్రీవాస్తవ కుటుంబానికి ఎదురైన ఘటన ఇది. ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీకి ఈ అనుభవం ఎదురుకావడంతో ఖంగుతిన్నారు. ఫిర్యాదు చేస్తే ఈ విషయాన్ని క్లబ్ అధికారులు పట్టించుకోలేదని శ్రీవాస్తవ ఆరోపించారు. వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టారు. తమ కుటుంబానికి మానసికంగా, శారీరకంగా నష్టం వాటిల్లిందని వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ ఇచ్చారు.

Price Hike: సామాన్యులకు షాక్... రేపటి నుంచి వీటి ధరల పెంపు

సేవా లోపం వల్లే ఈ ఘటన జరిగిందని, ఇందుకు నిర్లక్ష్యమే కారణమని కన్స్యూమర్ ఫోరం భావించింది. ఈ ఘటన వల్ల ఫిర్యాదుదారు చాలా రోజులు భోజనం చేయలేకపోయారని, ఈ సంఘటన అతని కుటుంబాన్ని మానసికంగా ప్రభావితం చేసిందని తెలిపింది. ఈ ఘటనతో అతని కుటుంబం మానసికంగా, శారీరకంగా నష్టపోయిందని వినియోగదారుల ఫోరం నిర్ణయానికి వచ్చింది. కన్స్యూమర్ ఫోరమ్ క్లబ్‌లోని రెస్టారెంట్‌కు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాదు... ఈ కేసుపై పోరాడేందుకు ఫిర్యాదుదారు చేసిన ఖర్చును కూడా చెల్లించాలని క్లబ్‌ను ఆదేశించింది.

IRCTC QR Code: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... క్యూఆర్ కోడ్ పేమెంట్ ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ

ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. అనేక మంది వినియోగదారులు ఇలాంటి కంప్లైంట్స్‌తో వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు.

గతే డాది మార్చిలో, ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ శాఖాహారానికి బదులుగా మాంసాహార పిజ్జాను అందించినందుకు కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ ఫోరమ్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తన మత విశ్వాసాలను దెబ్బతీసిందని, జీవితాంతం మానసిక వేదనకు గురి చేసిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Food delivery, VIRAL NEWS, Zomato

ఉత్తమ కథలు