హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment Tips: రెసిడెన్షియల్​, కమర్షియల్​ ప్రాపర్టీస్‌లో ఏది బెస్ట్..? ఆ వివరాలు పూర్తిగా ఇలా..

Investment Tips: రెసిడెన్షియల్​, కమర్షియల్​ ప్రాపర్టీస్‌లో ఏది బెస్ట్..? ఆ వివరాలు పూర్తిగా ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2021లో కరోనా కారణంగా రియల్​ ఎస్టేట్​ రంగం కుదేలైనప్పటికీ.. ఈ ఇండస్ట్రీ వేగంగా రికవరీని సాధిస్తోంది. అన్ని మెట్రో సిటీలు, ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్​ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

2021లో కరోనా కారణంగా రియల్​ ఎస్టేట్(Real Estate)​ రంగం కుదేలైనప్పటికీ.. ఈ ఇండస్ట్రీ వేగంగా రికవరీని సాధిస్తోంది. అన్ని మెట్రో సిటీలు(Metro Cities), ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్​ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే, రెసిడెన్షియల్​​ సెగ్మెంట్​లో ఇన్వెస్ట్​ చేయాలా? లేక కమర్షియల్​ సెగ్మెంట్​లో ఇన్వెస్ట్ చేయాలా? అని చాలా మంది ఇన్వెస్టర్లు(Investors) గందరగోళం చెందుతుంటారు. ఈ అంశంపై ఇండస్ట్రీ ఎక్స్​పర్టులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గత రెండేళ్లుగా కమర్షియల్​ రియల్​ ఎస్టేట్​ సెగ్మెంట్​ పెద్దగా గ్రోత్(Growth) చెందలేదని 2022లో కమర్షియల్​ సెగ్మెంట్​వేగంగా అభివృద్ది చెందే అవకాశం ఉందని అవంతా ఇండియా ఎండీ, నకుల్ మాథుర్ అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆగిపోయిన వాణిజ్య విస్తరణలు 2022లో కార్యరూపం దాల్చనున్నందున కమర్షియల్​ రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన డిమాండ్‌ను చూస్తోందని తెలిపారు.

Cyborg GT 120: ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 180 కిలోమీటర్ల రేంజ్..


“సాధారణంగా, రెసిడెన్షియల్​ స్పేస్​లతో పోలిస్తే కమర్షియల్​ స్పేస్​లపై ఎక్కువ అద్దె లభిస్తుంది. అందుకే లాంగ్​ టర్మ్​ లీజులు, కాంట్రాక్టులు కుదుర్చుకోవడం వల్ల రియల్టీ ఇన్వెస్టర్లు మంచి లాభాలు ఆర్జించవచ్చు. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఆఫీస్​లు, కో వర్కింగ్​ స్పేస్​లు, అఫోర్డబుల్​ షాప్​లు వంటి వాటిలో కమర్షియల్​ రియల్​ ఎస్టేట్​ ఇన్వెస్ట్​మెంట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇక, కమర్షియల్​ స్పేస్​లో ఫ్రాక్షనల్​ ఓనర్​షిప్​ అనే కొత్త కాన్సెప్ట్​కు ఆదరణ పెరుగుతుంది. ఈ కొత్త కాన్సెప్టు ప్రకారం, ఇన్వెస్టర్లు మొత్తం ప్రాపర్టీని కొనాల్సిన అవసరం ఉండదు.

ఈ ప్రాపర్టీలో కొంత వాటా కోసం ఇన్వెస్ట్​ చేయవచ్చు. మంచి రిటర్న్​లను పొందవచ్చు. ఈ ఏడాది కూడా ఫ్రాక్షనల్​ ఓనర్​షిప్​ కాన్సెప్ట్​కు మంచి డిమాండ్​ ఉంటుందని ఆశిస్తున్నాం.’’ అని నకుల్ మాథుర్ అన్నారు. కాగా, ఏ రియల్​ ఎస్టేట్​ సెగ్మెంట్​లో ఇన్వెస్ట్​ చేయాలనేది ఇన్వెస్టర్​ ఎంత కాలం వరకు ఇన్వెస్ట్​మెంట్లను హోల్డ్​ చేయగలడే అంశంపై ఆధారపడి ఉంటుందని రియల్​ ఎస్టేట్​ ఫండ్​ మేనేజ్​మెంట్​ రిసోర్స్​ స్పెషలిస్ట్​ సిద్దార్థ్​ మౌర్య అన్నారు.

గతేడాది 168 శాతం పెరిగిన కమర్షియల్​ ఇన్వెస్ట్​మెంట్..

"పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్కువ కాలం అమౌంట్​ను హోల్డ్​ చేయగలిగే వారు కమర్షియల్​ రియల్​ ఎస్టేట్​ను ఎంచుకోవచడం మంచిది. ఎందుకంటే, ఫ్లాట్​లు, అపార్ట్​మెంట్లు వంటి రెసిడెన్షియల్​ ప్రాపర్టీల ద్వారా క్రమం తప్పకుండా అద్దె ఆదాయం లభిస్తుంది. అందుకే 2022లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. త్వరలోనే వర్క్​ ఫ్రమ్​ ఆఫీస్​ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున కమర్షియల్​ రియల్​ ఎస్టేట్​ రంగానికి కలిసి రానుంది.’’ అని గోయెల్ గంగా గ్రూప్ & ప్రెసిడెంట్ డాక్టర్ అతుల్ గోయెల్ అన్నారు.

త్వరలోనే టాటా నుంచి బ్లాక్​బర్డ్​ మిడ్​ రేంజ్ ఎస్​యూవీ లాంచ్​.. సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వేరియంట్లలోనూ లభ్యం

తాజా రిపోర్ట్స్​ ప్రకారం, 2021 జూలై–-సెప్టెంబర్ త్రైమాసికంలో 1.2 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్​ స్పేస్​ను ఇన్వెస్టర్లు లీజుకు లేదా కాంట్రాక్ట్​​ తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 168 శాతం పెరిగింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాలు కమర్షియల్​ ఇన్వెస్టర్లను ఆకర్షించే నగరాల్లో అగ్రస్థానంలో నిలిచాయి.

Published by:Veera Babu
First published:

Tags: Business, Real estate

ఉత్తమ కథలు