హోమ్ /వార్తలు /బిజినెస్ /

Credit Card: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వారికి హెచ్చరిక.. ఇక 2 రోజులే మిగిలున్నాయ్!

Credit Card: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వారికి హెచ్చరిక.. ఇక 2 రోజులే మిగిలున్నాయ్!

 క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వారికి హెచ్చరిక.. ఇక 2 రోజులే మిగిలున్నాయ్!

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వారికి హెచ్చరిక.. ఇక 2 రోజులే మిగిలున్నాయ్!

Credit Card New Rules | క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Debit Card | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ల క్రెడిట్ కార్డు (Credit Card) డేటాకు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను ఏర్పాటు చేయడానికి వ్యాపారులకు నిర్దేశించిన గడువును పొడిగించకపోవచ్చు. ఇంకా ఈ అంశంపై కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, పేమెంట్ ఫెయిల్ కావడం, రెవెన్యూ నష్టాలు వంటివి ఉన్నా కూడా డెడ్‌లైన్‌ను పొడిగించే ఛాన్స్ మాత్రం ఉండదని బ్యాంకర్లు, మర్చంట్లు పేర్కొంటున్నారు.

  కొంత మంది చిరు వ్యాపారులు డెడ్‌లైన్‌ను పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఆర్‌బీఐ మాత్రం ఈసారి గడువు పొడిగించకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్‌బీఐ నుంచి కూడా గడువు పొడిగింపు అంశంపై ఎలాంటి సంకేతాలు లేవని తెలియజేస్తున్నాయి. బ్యాంకులు, క్రెడిట్ కార్డు నెట్‌వర్క్స్, పెద్ద పెద్ద మర్చంట్లు ఇప్పటికే ఈ రూల్ అమలుకు రెడీగా ఉన్నారని, అందుకే ఆర్‌బీఐ కూడా ఈసారి డెడ్‌లైన్‌ను పొడిగించకపోవచ్చని ఒక బ్యాంకర్ పేర్కొన్నారు.

  7 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర.. పతనమైన వెండి

  ఆర్‌బీఐ ఒక వేళ డెడ్‌లైన్‌ను పొడిగిస్తే మాత్రం.. అది నిజంగా ఆశ్చర్యకమని అభిప్రాయపడ్డారు. మూడేళ్ల కిందటనే భారత్ కార్డు వివరాల భద్రత అంశం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ సెప్టెంబర్ 30 కల్లా దీన్ని అమలు చేయాలని నిశ్చయించుకుంది. అందుకే కార్డు టోకెనైజేషన్ రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆర్‌బీఐ చూస్తోంది.

  డీఏ పెంపుతో ఉద్యోగులకు ముందే దసరా.. జీతం ఎంత పెరుగుతుందంటే?

  ఇకపోతే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు టోకెనైజేషన్ తప్పనిసరి. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్ వర్తిస్తుంది. కార్డు వివరాలను వెల్లడించకుండానే కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించొచ్చు. దీని కోసం కార్డులకు ఒక ప్రత్యేకమైన నెంబర్ లేదా టోకెన్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ఇవ్వడం ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. కార్డు అసలు వివరాలు తెలియజేయాల్సిన పని లేదు. డేటా సెక్యూరిటీ లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ రూల్స్ తెచ్చింది. ఆర్‌బీఐ 2019లోనే ఈ రూల్స్ తెచ్చింది. అయితే తర్వాత చాలా సార్లు టోకెనైజేషన్ అమలును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. అలాగే కొత్త రూల్స్ ప్రకారం ప్రతి కార్డుకు టోకెనైజేషన్ తప్పనిసరి. అలాగే మర్చంట్లు, ఇతర వెబ్‌సైట్లు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదు. దీని వల్ల కార్డు ద్వారా నిర్వహించే లావాదేవీలకు మరింత  భద్రత లభిస్తుందని చెప్పుకోవచ్చు.  అందుకే ఆర్‌బీఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Banks, Credit card, Debit card, New rules, Personal Finance, Rbi

  ఉత్తమ కథలు