రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ రుపీ పైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) మొదట హోల్‌సేల్ సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకులతో కలిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ హోల్‌సేల్ (e₹-W) లావాదేవీల ప్రారంభించింది ఆర్బీఐ. ఇక రీటైల్ సెగ్మెంట్లో అంటే సాధారణ వ్యాపారులకు, కస్టమర్లకు డిజిటల్ రుపీని అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్ 1న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ (e₹-R) పైలట్ ప్రాజెక్ట్ లాంఛ్ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
డిసెంబర్ 1న సీబీడీసీ రీటైల్ (e₹-R) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అంటే ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు. కరెన్సీ నోట్ల లాగానే e₹-R కూడా చట్టబద్ధంగా చెల్లుతుంది. డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. ప్రస్తుతం కాగితం కరెన్సీ, నాణేలు ఏ డినామినేషన్లలో అందుబాటులో ఉన్నాయో, అదే డినామినేషన్లలో డిజిటల్ రుపీని విడుదల చేయనుంది ఆర్బీఐ .
Bank Charges: ఆ అకౌంట్ ఉన్నవారికి డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
Operationalisation of Central Bank Digital Currency – Retail (e₹-R) Pilothttps://t.co/Coh632lCwU
— ReserveBankOfIndia (@RBI) November 29, 2022
రీటైల్ డిజిటల్ రుపీని బ్యాంకుల ద్వారా జారీ చేస్తుంది ఆర్బీఐ. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు చెందిన డిజిటల్ వ్యాలెట్‌లో డిజిటల్ కరెన్సీ ఉంటుంది. ఈ కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు చేయొచ్చు. తమ స్మార్ట్ఫోన్లు, డివైజ్‌లల్లో స్టోర్ చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, పర్సన్ టు మర్చెంట్ అంటే వ్యాపారులకు, కస్టమర్లకు మధ్య డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు చేయొచ్చు. వ్యాపారుల దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది.
ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ నోట్లలాగానే e₹-R కూడా విశ్వసనీయమైనది. సురక్షితంగా ఉంటుంది. వీటిని ఏదైనా బ్యాంకుల్లో కన్వర్ట్ చేసి కరెన్సీ నోట్లు తీసుకోవచ్చు. లేదా డిపాజిట్ చేయొచ్చు. రియల్ టైమ్‌లో డిజిటల్ రూపాయి సృష్టించడం, పంపిణీ చేయడం, రిటైల్ కస్టమర్లు వినియోగించడం లాంటివన్నీ పైలట్ ప్రాజెక్ట్‌లో పరీక్షిస్తారు. అవసరమైన మార్పుచేర్పులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.
Rupee Coins: ఆ కాయిన్స్ ఇక చెలామణిలో ఉండవా? ఆర్బీఐ ఏం చెబుతుందంటే...
పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎనిమిది బ్యాంకుల్ని గుర్తించింది ఆర్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులతో కలిసి దేశంలోని నాలుగు పట్టణాల్లో పైలట్‌ను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు పైలట్ ప్రాజెక్ట్‌లో చేరతాయి.
మొదట ముంబై, న్యూ ఢిల్లీ , బెంగళూరు, భువనేశ్వర్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గువాహతి, హైదరాబాద్ , ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, షిమ్లా నగరాల్లో పైలట్ ప్రారంభం అవుతుంది. అవసరాన్ని బట్టి మరిన్ని బ్యాంకుల్ని చేర్చుకోవడం, కొత్త ప్రాంతాల్లో పైలట్ ప్రారంభించడంపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digital currency, Digital Rupee, Personal Finance, Rbi, Reserve Bank of India