హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్‌బీఐ అలర్ట్

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్‌బీఐ అలర్ట్

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్‌బీఐ అలర్ట్
(ప్రతీకాత్మక చిత్రం)

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆర్‌బీఐ అలర్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

RBI Safety Tips | బ్యాంక్ అకౌంట్ హోల్డర్లను, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అప్రమత్తం చేస్తోంది.

మీకు ఏదైన్ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఏటీఎం కార్డు ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? క్రెడిట్ కార్డు లావాదేవీలు చేస్తుంటారా? అయితే జాగ్రత్త అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారు, కార్డులతో లావాదేవీలు జరిపేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI Says పేరుతో కస్టమర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో కస్టమర్లకు జాగ్రత్తలు సూచిస్తూ ఉంటుంది. అందులో భాగంగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా షేర్ చేస్తోంది. కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే కాదు, హిందీ, తెలుగు, ఉర్దూ లాంటి ఇతర భాషల్లో కూడా ఆర్‌బీఐ ఈ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం. కస్టమర్లకు ఆర్‌బీఐ ఇస్తున్న ముఖ్యమైన సూచనలు ఇవే.

HDFC Festive Treats: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్

SBI Loan EMI: ఎస్‌బీఐలో లోన్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌తో ఇక ఈఎంఐ టెన్షన్ ఉండదు

మీరు కార్డు లావాదేవీలు జరుపుతూ ఉంటారా? అయితే మీ లావాదేవీలకు డైలీ లిమిట్ సెట్ చేయండి. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.1,00,000 అనుకుందాం. కానీ మీరు ఎప్పుడు కూడా ఒక రోజులో రూ.10,000 కన్నా ఖర్చు పెట్టరు. అలాంటప్పుడు మీ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10,000 సెట్ చేసుకుంటే చాలు. ఏటీఎం కార్డుకూ ఇలా లిమిట్ పెట్టుకోవచ్చు. దీని వల్ల లాభేంటో తెలుసా? ఎప్పుడైనా మీ కార్డు పోగొట్టుకున్నా, ఇతరుల చేతుల్లోకి వెళ్లినా ఆ రోజు రూ.10,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం సాధ్యం కాదు. ట్రాన్సాక్షన్ చేయగానే మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తపడొచ్చు. అంటే మీరు కార్డు పోయిందని గుర్తించేలోపు రూ.10,000 నష్టపోతారు. అదే లిమిట్ మీరు సెట్ చేయకపోతే ఎంత లిమిట్ ఉంటే అంత ఖాళీ అయిపోతుంది. అందుకే డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేసుకోండి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ఆన్‌లైన్ యూసేజ్‌కి ఇలాగే లిమిట్ సెట్ చేయొచ్చు. అంతేకాదు... మీరు ఆన్‌లైన్, ఇంటర్నేషనల్ యూసేజ్ చేయాల్సిన అవసరం లేదంటే ఆఫ్ చేయడం మంచిది. ఇలాంటి జాగ్రత్తల వల్ల మీరు చాలా తక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

PM SVANidhi Scheme: మీ వ్యాపారానికి రుణాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం... ఈ స్టెప్స్‌తో అప్లై చేయండి

Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే

మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే నామినీ పేరు ఖచ్చితంగా రిజిస్టర్ చేయించాలి. లాకర్ మెయింటైన్ చేస్తున్నా నామినీ పేరు వెల్లడించాలి. దీని వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ సులువుగా పూర్తవుతుంది. ఇక మీ కేవైసీ వివరాలు కోరుతూ టెక్స్‌ట్ మెసేజ్, వాట్సప్ మెసేజ్, ఇమెయిల్ లాంటివి వచ్చాయా? అస్సలు నమ్మొద్దు. మీ కేవైసీ వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దు. మీ అకౌంట్ నెంబర్లు, కార్డు వివరాలు, పిన్, సీవీవీ, ఓటీపీ లాంటివి ఏవీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. తాము బ్యాంకు ప్రతినిధులమని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్లమని ఎవరైనా కాల్ చేసినా, ఇమెయిల్ చేసినా నమ్మొద్దు. మీ వివరాలు ఏవైనా అప్‌డేట్ చేయించాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి అప్‌డేట్ చేయించండి.

మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నట్టైతే వెబ్‌సైట్ https:// అని ప్రారంభం అవుతున్నాయో లేదో చెక్ చేయండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం మీకు తెలియని వైఫై నెట్వర్క్‌ని కనెక్ట్ చేయొద్దు. ఇలాంటి జాగ్రత్తల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు వివరిస్తోంది.

First published:

Tags: Bank, Bank account, Banking, Credit cards, Rbi

ఉత్తమ కథలు