ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,000. గోల్డ్ రేట్ రూ.50,000 వైపు దూసుకెళ్తోంది. మరి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మళ్లీ సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని రిలీజ్ చేయబోతోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 6 సార్లు గోల్డ్ బాండ్స్‌ని ఇష్యూ చేయనుంది. అంటే నెలకోసారి గోల్డ్ బాండ్స్ కొనే అవకాశం రానుంది. ఏఏ తేదీల్లో గోల్డ్ బాండ్స్ రానున్నాయ తెలుసుకోండి.
2020-21 సిరీస్ 1: ఏప్రిల్ 20 నుంచి 24... జారీ చేసే తేదీ ఏప్రిల్ 28
2020-21 సిరీస్ 2: మే 11 నుంచి 15... జారీ చేసే తేదీ మే 19
2020-21 సిరీస్ 3: జూన్ 8 నుంచి 12... జారీ చేసే తేదీ జూన్ 16
2020-21 సిరీస్ 4: జూలై 6 నుంచి 10... జారీ చేసే తేదీ జూలై 14
2020-21 సిరీస్ 5: ఆగస్ట్ 3 నుంచి 7... జారీ చేసే తేదీ ఆగస్ట్ 11
2020-21 సిరీస్ 6: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 4... జారీ చేసే తేదీ సెప్టెంబర్ 8
బంగారాన్ని ఫిజికల్‌గా కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో కొంటే అనేక లాభాలున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015 నవంబర్‌లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. అప్పట్నుంచి దశల వారీగా బాండ్స్‌ని జారీ చేస్తోంది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్‌లో తీసుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. మైనర్ పేరు మీదా ఈ బాండ్ తీసుకోవచ్చు.
గోల్డ్ బాండ్ అమ్మే ప్రతీసారి రేటును ఫిక్స్ చేస్తుంది ఆర్బీఐ. ఆ ధర మార్కెట్ రేటు కన్నా తక్కువే ఉంటుంది. అందుకే ఫిజికల్ గోల్డ్ కొనడం ఇష్టంలేనివాళ్లు గోల్డ్ బాండ్స్ తీసుకుంటారు. ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఎలాంటి కేవైసీ నిబంధనలు ఉంటాయో అవే గోల్డ్ బాండ్స్ కొనడానికీ వర్తిస్తాయి. ప్రతీ దరఖాస్తుపైన ఇన్వెస్టర్ పాన్ నెంబర్ తప్పనిసరి.
గోల్డ్ బాండ్స్ కూడా ఓ పెట్టుబడి సాధనమే. వీటిని డిమాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. వీటిని తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించే గోల్డ్ లోన్‌కు సమానంతో గోల్డ్ బాండ్స్‌పై లోన్స్ తీసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్‌పై వచ్చే వడ్డీకి ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ పీరియడ్ 8 ఏళ్లు. సంవత్సరానికి నామమాత్రపు విలువపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. అసలుతో పాటు మెట్యూరిటీపైన వడ్డీ లభిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు ఉన్న బంగారం ధరతో సమానంగా తిరిగి చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్ కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఈఎంఐలు కట్టాలి
Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Investment Plans, Silver rates, Sovereign Gold Bond Scheme