హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... రేపటి నుంచి సేల్

Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... రేపటి నుంచి సేల్

Sovereign Gold Bond | సావరిన్ గోల్డ్ బాండ్-SGB అమ్మకాలు మే 17న ప్రారంభం కానున్నాయి. మార్కెట్ ధర కన్నా తక్కువకే సావరిన్ గోల్డ్ బాండ్ లభిస్తోంది.

Sovereign Gold Bond | సావరిన్ గోల్డ్ బాండ్-SGB అమ్మకాలు మే 17న ప్రారంభం కానున్నాయి. మార్కెట్ ధర కన్నా తక్కువకే సావరిన్ గోల్డ్ బాండ్ లభిస్తోంది.

Sovereign Gold Bond | సావరిన్ గోల్డ్ బాండ్-SGB అమ్మకాలు మే 17న ప్రారంభం కానున్నాయి. మార్కెట్ ధర కన్నా తక్కువకే సావరిన్ గోల్డ్ బాండ్ లభిస్తోంది.

  బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు మొదలుపెడుతోంది. మే 17న సావరిన్ గోల్డ్ బాండ్-SGB స్కీమ్ 2021-22 మొదటి సబ్‌స్క్రిప్షన్ మొదలవుతుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ మే 21న ముగుస్తుంది. అంటే సేల్ 5 రోజులు ఉంటుంది. ఇక గోల్డ్ బాండ్ ఇష్యూ ధర ఒక గ్రాముకు రూ.4,777 ఫిక్స్ చేసింది ఆర్‌బీఐ. అంటే మార్కెట్ ధర కన్నా గోల్డ్ బాండ్ ధర తక్కువే. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,990. ఒకవేళ 10 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే రూ.47,770 చెల్లించాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే గ్రాముకు రూ.50 అంటే 10 గ్రాములకు రూ.500 తగ్గింపు లభిస్తుంది. అంటే ఆన్‌లైన్‌లో 10 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్‌ను రూ.47,270 ధరకు కొనొచ్చు. మార్కెట్ ధర కన్నా రూ.1,720 ధరకే 10 గ్రాముల గోల్డ్ కొనొచ్చు.

  సావరిన్ గోల్డ్ బాండ్‌తో అనేక లాభాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌లో ఫిజికల్ గోల్డ్‌కు పెరిగిపోతున్న డిమాండ్‌ను తగ్గించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ప్రతీ ఏటా 12 సార్లు అంటే నెలకోసారి గోల్డ్ బాండ్ అమ్మకాలు ఉంటాయి. నేరుగా నగలు కొనకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు సావరిన్ గోల్డ్ బాండ్ ఓ సదవకాశం. గోల్డ్ బాండ్ కొంటే స్వచ్ఛమైన బంగారం కొన్నట్టే. అయితే బంగారం సర్టిఫికెట్ రూపంలో ఉంటుంది.

  AC Buying Guide: ఏసీ కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

  Poco M2 Reloaded: ఎక్స్‌ఛేంజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.599 మాత్రమే

  సావరిన్ గోల్డ్ బాండ్‌ను ఎవరైనా కొనొచ్చు. వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటీ సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు కొనొచ్చు. ట్రస్టులు, సంస్థలు 20 కిలోల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే 8 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉందో లెక్కించే అంతే ధర చెల్లిస్తారు. దీంతో పాటు ఏడాదికి 2.5 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లిస్తుంది ఆర్‌బీఐ. ఈ రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.

  Loan: ఈ రుణాలకు అప్లై చేయడానికి ఇంకొన్ని రోజులే గడువు

  Driving Licence: మీ స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల గోల్డ్ బాండ్ సేల్ షెడ్యూల్‌ను ప్రకటించింది ఆర్‌బీఐ. మే 17 నుంచి మే 21 వరకు మొదటి సబ్‌స్క్రిప్షన్, మే 24 నుంచి 28 వరకు రెండో సబ్‌స్క్రిప్షన్, మే 31 నుంచి జూన్ 4 వరకు మూడో సబ్‌స్క్రిప్షన్, జూలై 12 నుంచి జూలై 16 వరకు నాలుగో సబ్‌స్క్రిప్షన్, ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 13 వరకు ఐదో సబ్‌స్క్రిప్షన్, ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆరో సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

  First published:

  Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold loans, Gold ornmanets, Gold price, Gold price down, Gold Prices, Gold rate, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme

  ఉత్తమ కథలు