హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loans: లోన్లు తీసుకునేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్

Loans: లోన్లు తీసుకునేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్

Loans: లోన్లు తీసుకునేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)

Loans: లోన్లు తీసుకునేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

Loans | బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్. వారికి ఎలక్ట్రానిక్ కార్డులు ఇచ్చేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI.

బ్యాంకులు కొందరు కస్టమర్లకు ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఇస్తాయన్న సంగతి తెలిసిందే. ఖాతాదారుల అర్హతల్ని బట్టి ఈ ఓడీ లోన్స్ ఉంటాయి. కస్టమర్లు ఓడీ లోన్స్ కోసం బ్యాంకులో అప్లై చేయాలి. లిమిట్ ఎంత ఉంటే అంత వరకు ఓడీ లోన్స్ తీసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో కొన్ని మార్పులు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఓడీ అకౌంట్స్ ఉన్నవారికి లోన్ తీసుకోవడానికి డెబిట్ కార్డుల్లాంటి ఎలక్ట్రానిక్ కార్డులు జారీ చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు డెబిట్ కార్డులు ఇచ్చినట్టే ఓడీ అకౌంట్ హోల్డర్లకు ప్రత్యేక కార్డులు ఉంటాయి. ఆ కార్డులతో ఆన్‌లైన్‌, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కుదరదు. అయితే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY అకౌంట్లు ఉన్నవారు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉపయోగించుకోవాలంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఆంక్షలేమీ ఉండవు.

ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ పర్సనల్ లోన్స్ లాంటివే. కానీ కొన్ని తేడాలుంటాయి. సాధారణంగా పర్సనల్ లోన్‌కు కాలవ్యవధి, బ్యాంకు నిర్థారించిన వడ్డీ రేటు ఉంటాయి. ప్రతీ నెల ఈఎంఐ చెల్లించాలి. ఓడీ అకౌంట్ క్రెడిట్ లైన్ లోన్స్ లాంటివి. వాడుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించాలి. ఉదాహరణకు మీ ఓడీ లిమిట్ రూ.5,00,000 అనుకుందాం. అందులో మీరు రూ.1,00,000 మాత్రమే వాడుకున్నారు. మీరు వాడుకున్న రూ.1,00,000 పైన మాత్రమే వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ రోజు వారీగా లెక్కిస్తారు. మీ నెలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. సాలరీ ఓవర్ డ్రాఫ్ట్, హోమ్ లోన్ ఓవర్ డ్రాఫ్ట్, రెగ్యులర్ ఓడీ లిమిట్ ఇస్తుంటాయి బ్యాంకులు. ఓడీ లోన్లకు ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉంటాయి. పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ ఫీజుల కన్నా ఇవి ఎక్కువ.

ఇవి కూడా చదవండి:

Aadhaar card: గుడ్ న్యూస్... ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయడం ఇంకా ఈజీ

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే

మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా

First published:

Tags: Bank loans, Business, BUSINESS NEWS, Home loan, Housing Loans, Personal Finance, Personal Loan, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు