డిజిటల్ పేమెంట్లను మరింత సులభతరం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. బ్యాంకింగేతర సంస్థలు కూడా కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థల్లో(సీపీఎస్) భాగం కానున్నాయని ఆర్బీఐ ప్రకటించింది. దశల వారీగా రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్(RTGS), నేషనల్ ఎలక్ట్రిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (NEFT) విధానాలు సీపీఎస్‌లో పాల్గొనవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. గత ఏప్రిల్‌లోనే బ్యాంకింగేతర సంస్థలకు సీపీఎస్ యాక్సెస్ ఇవ్వనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చెల్లింపుల సదుపాయం కేవలం బ్యాంకులకు మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూవర్స్(పీపీఐ), కార్డ్ నెట్‌వర్క్‌లు, ఏటీఎం ఆపరేటర్లు సీపీఎస్ మొదటి దశలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారని ఆర్పీఐ తాజా ప్రకటనలో పేర్కొంది.
బ్యాంకులు కాకుండా చాలా తక్కువగా ఎంపిక చేసిన బ్యాంకింగేతర సంస్థలు.. సీపీఎస్‌లో భాగమయ్యేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. సీపీఎస్ మెంబర్షిప్/యాక్సెస్ కు అనుమతి ఉన్న నాన్ బ్యాంకుల్లో స్వతంత్ర ప్రాథమిక డీలర్లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, సెంట్రల్ కౌంటర్ పార్టీలు, రిటైల్ చెల్లింపు వ్యవస్థ సంస్థలు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు(నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్), డీఐసీజీసీ లాంటివి ఉన్నాయి. ఆర్టీజీఎస్ లావాదేవీల స్వభావం అనేది మెంబర్షిప్ రకాన్ని బట్టి ఉంటుంది. అవసరాలను బట్టి కొన్ని పీఎస్పీలు కూడా ఎన్ఈఎఫ్టీలో పాల్గొనడానికి అనుమతి పొందుతాయి.
1. RTGS/NEFT వినియోగదారుల చెల్లింపులు..
ఏ. పీపీఐ ఇష్యూవర్ల నుంచి వ్యాపారులు/పేమెంట్ అగ్రిగేటర్ల వరకు
బీ. డబ్ల్యూఎల్ఏ ఆపరేటర్ల నుంచి ఏటీఎంలు నిర్వహించే ఏజెన్సీల వరకు
సీ. కేవైసీ పీపీఐ కస్టమర్ల ఖాతా నుంచి పీపీఐలను లోడ్ చేసే వరకు
2.RTGS ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు..
ఏ. నికర డెబిట్ లేదా క్రెడిట్ పొజిషన్ ఆధారంగా సభ్యుల బ్యాంకులతో వారి ఎస్క్రో ఖాతాలో నాన్ బ్యాంక్ పీస్పీలు తగినంత బ్యాలెన్స్ నిర్వహించడానికి
బీ. డబ్ల్యూఎల్ఏ ఆపరేటర్లు, ఇతర సభ్య బ్యాంకులు లేదా నాన్ బ్యాంకులు
3. ఆర్టీజీఎస్లో పోస్ట్ చేసిన మల్టీపాట్రల్ బ్యాచ్ లు(MNSB)..
ఏ. సెటిల్మెంట్ల కోసం కార్డు నెట్వర్కులు, వివాద నిర్వహణ, వార్షిక రుసుము వసూలు మొదలైన వాటికోసం కార్డు నెట్వర్కులు
బీ. ఎన్ఎఫ్ఎస్ లలో డబ్ల్యూఎల్ఏ ఆపరేటర్లకు ప్రత్యక్ష క్రెడిట్
సీ. బ్యాంకింగేతర పీఎస్పీల లావాదేవీలను వారి స్పాన్సర్ బ్యాంకులతో సంబంధం లేకుండా పరిష్కరించడానికి NPCI అనుమతి
సీపీఎస్ యాక్సెస్ కోసం బ్యాంకేతర పీఎస్పీలు కేంద్ర బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చాలి. పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 కింద రిజర్వ్ బ్యాంక్ నుంచి చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ ఆథరైజేషన్(సీఓఏ).. నికర విలువ రూ.25 కోట్లు లేదా సీఓఏ ప్రకారం సూచించిన మొత్తం(ఏది ఎక్కువగా ఉంటే అది).. వంటి ప్రమాణాలను పాటించాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.