Home /News /business /

RESERVE BANK OF INDIA RBI STARTED NEW SERVICE NOW NO INTERNET SMARTPHONE NEEDED FOR DIGITAL PAYMENTS AK

RBI: ఆర్‌బీఐ కొత్త సర్వీస్ ప్రారంభం.. ఇక ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లేకుండానే డిజిటిల్ పేమెంట్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPI Services: ఇప్పటి వరకు UPI యొక్క సేవలు ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయన్న RBI గవర్నర్ శక్తికాంత దాస్.. దీని కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు వాటిని ఉపయోగించలేకపోతున్నారని చెప్పారు.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఒక కొత్త సేవను ప్రారంభించారు. దీని ద్వారా 40 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ లేదా సాధారణ మొబైల్ ఫోన్ వినియోగదారులు సురక్షితమైన పద్ధతిలో డిజిటల్ చెల్లింపులు చేయగలుగుతారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని వ్యక్తులు UPI '123pay' అనే ఈ సేవ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవలు సాధారణ ఫోన్‌లలో పని చేస్తుంది. ఇప్పటి వరకు UPI యొక్క సేవలు ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయన్న RBI గవర్నర్ శక్తికాంత దాస్.. దీని కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు వాటిని ఉపయోగించలేకపోతున్నారని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు రూ.76 లక్షల కోట్లకు చేరాయని.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.41 లక్షల కోట్లుగా ఉన్నాయని చెప్పారు. మొత్తం లావాదేవీల సంఖ్య 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

    దేశంలో 400 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు సాధారణ ఫీచర్ ఫోన్‌లను కలిగి ఉన్నారన్నది ఓ అంచనా. ప్రస్తుతం యుఎస్‌ఎస్‌డి ఆధారిత సేవల ద్వారా యుపిఐ సేవలు అటువంటి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని.. ఇది చాలా గజిబిజిగా ఉందని తెలిపారు. అన్ని మొబైల్ ఆపరేటర్లు అలాంటి సేవలను అనుమతించడం లేదని డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ అన్నారు.

    ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు నాలుగు సాంకేతిక ఎంపికల ఆధారంగా విస్తృత శ్రేణి లావాదేవీలను నిర్వహించవచ్చని RBI తెలిపింది. వీటిలో కాలింగ్ IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌లు, ఫీచర్ ఫోన్‌లలో యాప్ ఫంక్షనాలిటీ, మిస్డ్ కాల్ ఆధారిత పద్ధతి, సామీప్య వాయిస్ ఆధారిత చెల్లింపులు ఉన్నాయి.

    Home Loan Scheme: మీ సొంత ఇంటి క‌ల‌కు చేయూత‌.. కేంద్ర ప్ర‌భుత్వ స్కీమ్ గురించి తెలుసుకోండి!

    PPF Account Rules: పీపీఎఫ్‌లో రెండు ఖాతాలు ఉన్నాయా..? జాగ్రత్త.. జరిమానా పడే ఛాన్స్

    ఈ సేవ ద్వారా వినియోగదారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపవచ్చు, వివిధ యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. వాహనాల ఫాస్ట్ ట్యాగ్‌లను రీఛార్జ్ చేయడానికి, మొబైల్ బిల్లులను చెల్లించే సౌకర్యాన్ని కూడా పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన డిజిటల్ చెల్లింపుల కోసం ఒక హెల్ప్‌లైన్‌ను దాస్ మంగళవారం ప్రారంభించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Rbi, UPI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు