Home /News /business /

RESERVE BANK OF INDIA RBI REITERATES LEGAL TENDER STATUS OF RS 10 COINS SS

10 Rupees Coin: పది రూపాయల నాణెం చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

10 Rupees Coin: పది రూపాయల నాణెం చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
(ప్రతీకాత్మక చిత్రం)

10 Rupees Coin: పది రూపాయల నాణెం చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)

Rs 10 Coin | మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా? మార్కెట్లో ఇస్తే ఆ నాణేలను తీసుకోవట్లేదా? అసలు రూ.10 నాణెం చెల్లుతుందా... లేదా అన్న అనుమానాలున్నాయా? దీనిపై క్లారిటీ ఇచ్చింది ఆర్‌బీఐ.

    కిరాణా షాప్‌కి వెళ్లి పది రూపాయల కాయిన్ ఇస్తే చెల్లదని వెనక్కి ఇస్తుంటారు. కూరగాయలకు వెళ్లినప్పుడు షాప్ యజమాని రూ.10 నాణెం ఇస్తే తీసుకునేందుకు సామాన్యులు వెనకాడుతుంటారు. రూ.10 నాణెం చెల్లుతుందా? లేదా? అన్న అనుమానాలు ఇప్పటికీ సామాన్యుల్లో ఉన్నాయి. రూ.10 కాయిన్ చెల్లుతుందని కొందరు, చెల్లదని ఇంకొందరు... ఈ వాదనలు చాలాకాలంగా ఉన్నవే. వాదనలు మాత్రమే కాదు... కొన్నిసార్లు గొడవలు కూడా జరిగిపోతున్నాయి. రూ.10 నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది. బ్యాంకులు కూడా సందేహాలను తీర్చాయి. అయినా రూ.10 నాణెం చెల్లదనే అనుమానాలు సామాన్యుల్లో, షాపుల నిర్వాహకుల్లో ఉన్నాయి. ఈ అయోమయానికి తెరదించుతూ రూ.10 నాణెం చెల్లుబాటు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సంచాలకులు శుభ్రతదాస్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. రూ.10 నాణెం చెల్లదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఫైనాన్షియల్ లిటరసీ వీక్' నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో 5కే రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సంచాలకులు శుభ్రతదాస్ రూ.10 నాణెం చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదు... గతంలో కూడా ఇలాంటి అయోమయం ప్రజల్లో నెలకొంటే రూ.10 నాణం చెల్లుతుందని ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. ఇక 'ఫైనాన్షియల్ లిటరసీ వీక్'లో భాగంగా ఈ నెల 10 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లభించే లోన్స్‌పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.

    ఇవి కూడా చదవండి:

    Bank strike: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్

    Kakeibo: కాకీబో... ఈ జపనీస్ టెక్నిక్ తెలిస్తే లక్షాధికారి కావొచ్చు

    Realme PaySa: ఐదు నిమిషాల్లో రూ.1,00,000 వరకు అప్పు... 'రియల్‌మీ పేసా' ఆఫర్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business, BUSINESS NEWS, Hyderabad, Hyderabad news, Rbi, Reserve Bank of India, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు