Good News: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్

NEFT payment | నెప్ట్‌కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. 2020 జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకుల్ని ఆదేశించింది.

news18-telugu
Updated: December 17, 2019, 12:00 PM IST
Good News: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్
Good News: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మరో శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-NEFT ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలను ఎత్తివేయాలని బ్యాంకుల్ని ఆదేశించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెఫ్ట్ వేళల్ని మారుస్తూ ఆర్‌బీఐ అతిపెద్ద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో నెఫ్ట్ లావాదేవీలు ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకే సాధ్యమయ్యేది. కానీ డిసెంబర్ 16 నుంచి నెఫ్ట్ 24 గంటలు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు నెప్ట్‌కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. 2020 జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకుల్ని ఆదేశించింది.





ప్రస్తుతం రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు నెఫ్ట్ మనీ ట్రాన్స్‌ఫర్‌పై రూ.5 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు రూ.15 ఛార్జీ ఉండగా, రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు రూ.25 చొప్పున ఛార్జీలున్నాయి. జనవరి 1 నుంచి ఈ ఛార్జీలేవీ ఉండవు. మీరు ఆన్‌లైన్‌లో నెఫ్ట్ ద్వారా ఎంత మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరమే లేదు. అంతేకాదు... డిసెంబర్ 16 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వేళల ద్వారా మీరు రోజులో 24 గంటలు, ఏడాదిలో 365 రోజులు నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

LIC Scholarship: టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఎల్ఐసీ స్కాలర్‌షిప్స్... అప్లై చేయండిలా

Flipkart Year End Sale 2019: భారీ ఆఫర్లతో 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019'... డిస్కౌంట్స్ ఇవే

PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్‌ డిసెంబర్ 31... లింక్ చేయండిలా
First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు