RBI: ఆ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... జూలై 1 నుంచి కొత్త రూల్స్

Basic Savings Bank Deposit-BSBD account | ఐదు నిబంధనల్లో మార్పు అకౌంట్ హోల్డర్లకు ఎంతో మేలు చేయనున్నాయి. జూలై 1 నుంచి బీఎస్‌బీడీ అకౌంట్లకు అమలులో ఉండే నిబంధనలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 26, 2019, 5:04 PM IST
RBI: ఆ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... జూలై 1 నుంచి కొత్త రూల్స్
RBI: ఆ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... జూలై 1 నుంచి కొత్త రూల్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 26, 2019, 5:04 PM IST
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అవి అకౌంట్ హోల్డర్లకు మేలు చేసే నిబంధనలే. ఇటీవల జీఎస్‌టీ కౌన్సిల్ కొన్ని పన్నుల్ని తగ్గించింది, సేవల్ని మినహాయించింది. వాటిలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు అందించే సేవలు కూడా ఉన్నాయి. దీంతో కొన్ని నిబంధనల్ని సడలించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు ఉన్నవారికి బ్యాంకుల నుంచి మరిన్ని సేవలు ఉచితంగానే అందనున్నాయి. వాటిలో ఐదు నిబంధనల్లో మార్పు అకౌంట్ హోల్డర్లకు ఎంతో మేలు చేయనున్నాయి. జూలై 1 నుంచి బీఎస్‌బీడీ అకౌంట్లకు అమలులో ఉండే నిబంధనలేంటో తెలుసుకోండి.

Read this: Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్

1. ఒక నెలలో బ్యాంకులు, ఏటీఎంలల్లో కనీసం నాలుగు విత్‌డ్రాయల్స్.

2. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్లు తమ బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్‌లో అయినా నగదు డిపాజిట్ చేసే అవకాశం. క్యాష్ డిపాజిట్ మెషీన్లలోనూ డిపాజిట్ చేయొచ్చు.


3. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్లకు ఏటీఎం లేదా ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్.
4. ఒక నెలలో డిపాజిట్ల సంఖ్యపై పరిమితి లేదు. అంటే ఎన్నిసార్లైనా నగదు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసే మొత్తంపై పరిమితి లేదు. అంటే ఎంత నగదైనా డిపాజిట్ చేయొచ్చు.
5. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్లకు ఉచితంగా చెక్ బుక్.
Loading...
మారిన నిబంధనలన్నీ జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఎవరైనా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. సేవింగ్స్ అకౌంట్‌లో వచ్చే ప్రయోజనాల కంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లో ఉండే ప్రయోజనాలు కాస్త తక్కువగా ఉంటాయి.

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Good News: పెరిగిన కేబుల్ ధరలపై దృష్టిపెట్టిన ట్రాయ్

Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్
First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...