Repo Rate: దసరా ముందు మరో గుడ్ న్యూస్... లోన్లపై భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు

Repo Rate Cut | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. ఐదుసార్లు మొత్తం కలిపితే 135 బేసిస్ పాయింట్స్ తగ్గింది. మొత్తంగా చూస్తే వడ్డీ రేట్లు భారీగా తగ్గినట్టే.

news18-telugu
Updated: October 4, 2019, 12:08 PM IST
Repo Rate: దసరా ముందు మరో గుడ్ న్యూస్... లోన్లపై భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు
Repo Rate: దసరా ముందు మరో గుడ్ న్యూస్... లోన్లపై భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 4, 2019, 12:08 PM IST
వరాల వర్షం కురిపిస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. దసరా ముందు మరో గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్‌ను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. శుక్రవారం సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ-MPC ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అక్టోబర్ 1న రేట్ నిర్ణయించే సమావేశంలో రెపో రేట్ తగ్గింపుపై సూచనప్రాయంగా తెలిపారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశంలో రెపో రేట్ తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారు. 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో రేపో రేట్ 5.15 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణ ముప్పు తప్పించుకునేందుకు, వృద్ధి వైపుగా అడుగులు వేసేందుకు ఎప్పటివరకు అవసరమైతే అప్పటివరకు ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. ఐదుసార్లు మొత్తం కలిపితే 135 బేసిస్ పాయింట్స్ తగ్గింది. మొత్తంగా చూస్తే వడ్డీ రేట్లు భారీగా తగ్గినట్టే. అక్టోబర్ 1 నుంచే రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్, వెహికిల్ లోన్, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలను మంజూరు చేసే విధానం మొదలైంది. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిచండంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ భారం సామాన్యులపై భారీగా తగ్గనుంది. కొత్తగా ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లు ఆకర్షించే అవకాశముంది. ద్రవ్య పరపతి విధాన కమిటీ-MPC మరోసారి డిసెంబర్ 3 నుంచి 5 వరకు సమావేశం కానుంది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
Loading...
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? లిమిట్ పెంచుకోండి ఇలా
First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...