Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారికి ఆర్‌బీఐ శుభవార్త

Money Transfer | ఆర్‌టీజీఎస్ వేళల్ని ఆర్‌బీఐ పొడిగించడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. మేలో ఆర్‌టీజీఎస్ వేళల్ని గంటన్నర పొడిగించింది ఆర్‌బీఐ.

news18-telugu
Updated: August 22, 2019, 5:20 PM IST
Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారికి ఆర్‌బీఐ శుభవార్త
Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారికి ఆర్‌బీఐ శుభవార్త (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 22, 2019, 5:20 PM IST
మీరు తరచూ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారా? ఆర్‌టీజీఎస్ పేమెంట్ సర్వీస్ వాడుతుంటారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI టైమింగ్స్ మార్చేసింది. ప్రస్తుతం రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS ద్వారా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టమర్లు లావాదేవీలు జరపొచ్చు. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:45 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆర్‌టీజీఎస్ సర్వీస్‌ను కస్టమర్లకు ఇంకాస్త ఎక్కువ సమయం అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ భావించింది. అందుకే ఆర్‌టీజీఎస్ లావాదేవీల సమయాన్ని ఓ గంట పొడిగించింది. కస్టమర్లు, బ్యాంకులు ఆర్‌టీజీఎస్ ద్వారా ఉదయం 7 గంటల నుంచే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మారిన వేళలు ఆగస్ట్ 26 నుంచే అమలులోకి వస్తాయి. ఆర్‌టీజీఎస్ వేళల్ని ఆర్‌బీఐ పొడిగించడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. మేలో ఆర్‌టీజీఎస్ వేళల్ని గంటన్నర పొడిగించింది ఆర్‌బీఐ. అంతకుముందు సాయంత్రం 4.30 గంటల వరకే ఆర్‌టీజీఎస్ పేమెంట్స్‌ని అనుమతించేది. ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది ఆర్‌బీఐ. ఇప్పుడు ఆర్‌టీజీఎస్ ప్రారంభమయ్యే సమయాన్ని ఓ గంట ముందుకు జరిపింది. అంటే ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అదనంగా రెండున్నర గంటల సమయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Real Time Gross Settlement timings, Real Time Gross Settlement new timings, RTGS system, what is RTGS, difference between imps neft and rtgs, Reserve Bank of India, RBI, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ టైమింగ్స్, ఆర్‌టీజీఎస్ టైమింగ్స్, ఆర్‌టీజీఎస్ వేళలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్‌బీఐ
ఆగస్ట్ 26 నుంచి అమలులోకి వచ్చే ఆర్‌టీజీఎస్ వేళలు ఇవే...
(Source: RBI)


డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి మూడు పద్ధతులుంటాయి. ఒకటి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్-NEFT. రెండోది రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS. మూడోది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS. నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే సెటిల్మెంట్ పద్ధతిలో అవతలివాళ్ల అకౌంట్‌లోకి వెళ్తాయి. అది కూడా బ్యాంకు పనిచేసే వేళల్లో మాత్రమే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఐఎంపీఎస్ ద్వారా వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇందుకోసం కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS ఉపయోగపడుతుంది. ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:
Loading...
Loan in 59 minutes: 59 నిమిషాల్లో హోమ్ లోన్, కార్ లోన్ ఇవ్వనున్న బ్యాంకులు

Good News: క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త సదుపాయం... ఇక పేమెంట్స్ ఈజీ

SBI: ఎస్‌బీఐ గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా లోన్స్
First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...