కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అన్ని రకాల లోన్లపై ఈఎంఐలను మూడు నెలలు మారటోరియం విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే కస్టమర్లు ఈ మూడు నెలలు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రీపేమెంట్ చేయకపోవడం వల్ల వారి క్రెడిట్ స్కోర్‌కు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. అయితే ఆర్బీఐ విధించిన మారటోరియంపై కస్టమర్లలో అనేక సందేహాలున్నాయి. ఆ సందేహాలకు సమాధానాలివే.
ప్రశ్న: నా ఈఎంఐ డ్యూ త్వరలో ఉన్నది. నా అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అవుతాయా?
జవాబు: బ్యాంకులు విరామాన్ని అంగీకరించాలని మాత్రమే ఆర్బీఐ చెప్పింది. బ్యాంకులు ఈఎంఐలను నిలిపివేయాల్సి ఉంటుంది. అంటే మీకు బ్యాంకు నుంచి అప్రూవల్ ఉండాలి. లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు ఉంటే ఈఎంఐ డిడక్ట్ అవుతుంది.
ప్రశ్న: నా ఈఎంఐ నిలిపివేసినట్టు ఎలా తెలుస్తుంది?
జవాబు: ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ని ఆర్బీఐ వెల్లడించలేదు. ఆ గైడ్‌లైన్స్ వచ్చాక స్పష్టత ఉంటుంది.
ప్రశ్న: బ్యాంకులో ఈ ప్రక్రియ అంతా ఎలా ఉంటుంది?
జవాబు: అన్ని బ్యాంకులూ మారటోరియంపై చర్చించాల్సి ఉంటుంది. బోర్డు లెవెల్లో నిర్ణయం తీసుకోవాలి. ఆమోదముద్ర పడ్డ తర్వాత బ్యాంకులు మారటోరియంపై కస్టమర్లకు సమాచారం ఇస్తాయి.
ప్రశ్న: బ్యాంకులు నా ఈఎంఐలను నిలిపివేస్తే, నేను ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?
జవాబు: మారటోరియం విధించిన మూడు నెలలు ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.
ప్రశ్న: ఏఏ బ్యాంకులకు ఈ మారటోరియం వర్తిస్తుంది?
జవాబు: అన్ని కమర్షియల్ బ్యాంకులు (రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, స్థానిక బ్యాంకులు), కో-ఆపరేటీవ్ బ్యాంకులు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీ(హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు).
ప్రశ్న: మారటోరియం అంటే ఈఎంఐలను ఎత్తేసినట్టా? వాయిదా వేసినట్టా?
జవాబు: ఇది ఈఎంఐలను ఎత్తేసినట్టు కాదు. కేవలం వాయిదా వేసినట్టే. అన్ని లోన్లపై రీపేమెంట్ షెడ్యూల్‌ను మూడు నెలలు పొడిగించాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. అంటే మీరు ఈ మూడు నెలలు ఈఎంఐలు చెల్లిచకపోతే లోన్ టెన్యూర్ మూడు నెలలు పెరుగుతుంది.
ప్రశ్న: మారటోరియం అసలు, వడ్డీ రెండింటినీ కవర్ చేస్తుందా?
జవాబు: మారటోరియంలో అసలు, వడ్డీ రెండూ కవర్ అవుతాయి. మూడు నెలలపాటు మొత్తం ఈఎంఐ పేమెంట్ని మినహాయించడం అంటే అందులో అసలు, వడ్డీ ఉంటుంది. 2020 మార్చి 1న ఉన్న మీ ఔట్‌స్టాండింగ్ లోన్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది.
ప్రశ్న: ఎలాంటి లోన్లు మారటోరియంలో కవర్ అవుతాయి?
జవాబు: ఆర్బీఐ పాలసీ స్టేట్మెంట్లో టర్మ్ లోన్స్ అని ప్రస్తావించారు. అందులో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఆటో లోన్స్ లాంటి ఫిక్స్డ్ టెన్యూర్ ఉన్న లోన్స్ అన్నీ వర్తిస్తాయి. వీటిలో మొబైల్, ఫ్రిజ్, టీవీ లాంటివి ఈఎంఐలో తీసుకున్నా వర్తిస్తుంది.
ప్రశ్న: క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌కి కూడా మారటోరియం వర్తిస్తుందా?
జవాబు: క్రెడిట్ కార్డులను రివాల్వింగ్ క్రెడిట్‌గా భావిస్తారు. టర్మ్ లోన్స్ కావు. అయినా బ్యాంకులు బిల్లు చెల్లింపులను వాయిదా వేయాలని ఆర్బీఐ కోరింది.
ప్రశ్న: ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ప్రాజెక్ట్ లోన్ తీసుకున్నాను. నేను ఈఎంఐ చెల్లించకూడదా?
జవాబు: మారటోరియం టర్మ్ లోన్స్‌కు మాత్రమే. మీరు ఈఎంఐ చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్టు బ్యాంకు భావిస్తే వాయిదా కోరొచ్చు.
ప్రశ్న: వ్యాపారుల కోసం ఆర్బీఐ ఏమి ప్రకటించింది?
జవాబు: వ్యాపారాల కోసం వర్కింగ్ క్యాపిటల్ లోన్లు తీసుకున్నవారు చెల్లించాల్సిన వడ్డీని వాయిదా వేసింది ఆర్బీఐ. 2020 మార్చి 1 నాటికి ఉన్న అన్ని వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీస్‌కి ఇది వర్తిస్తుంది. మీ లోన్ టర్మ్ అండ్ కండీషన్లో ఎలాంటి మార్పులు ఉండవు.
ఇవి కూడా చదవండి:
Good News: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ఈఎంఐలు
Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు డబ్బులు లేవా? ఇలా చేయండి
Digital Payments: బయటకు వెళ్లలేకపోతున్నారా? పేమెంట్స్ ఇంటి నుంచే చేయండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank loans, Banking, Card, Credit cards, Home loan, Housing Loans, Personal Finance, Personal Loan, Rbi, Rbi governor, Reserve Bank of India