Good News: లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్... అక్టోబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు

Repo Rate Linked Loans | రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ప్రకారం రుణాలు ఇస్తే... ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించినప్పుడల్లా ఆ లాభం నేరుగా కస్టమర్లకు చేరుతుంది.

news18-telugu
Updated: September 5, 2019, 5:20 PM IST
Good News: లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్... అక్టోబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు
పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి ఖాతాలపై రూ.10 చార్జ్ వసూలు చేస్తారు.
  • Share this:
మీరు హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI శుభవార్త చెప్పింది. 2019 అక్టోబర్ 1 నుంచి రెపో రేట్ లింక్డ్ వడ్డీ రేట్లను అమలు చేయాలని అన్ని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్స్ ఇస్తోంది. ఇతర బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. మిగతా బ్యాంకులు కూడా ఆర్‌బీఐ రెపో రేట్‌ను బెంచ్ మార్క్‌గా తీసుకొని రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్‌-RLLR ప్రకారం హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వ్యాపార రుణాలను ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఆదేశాలు రుణాలు తీసుకునేవారికి మేలు చేయనుంది.

రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ అంటే ఏంటీ?



ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించినా కస్టమర్లకు వడ్డీ రేటు మారదు. ఒకవేళ రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ప్రకారం రుణాలు ఇస్తే... ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించినప్పుడల్లా ఆ లాభం నేరుగా కస్టమర్లకు చేరుతుంది. అందుకే ఖాతాదారులకు మేలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే MCLR వడ్డీ రేటు ప్రకారం రుణాలు తీసుకుని హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్నవారంతా అక్టోబర్ 1 తర్వాత రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్‌కు మారొచ్చు.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలాLIC: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించట్లేదా? పెయిడ్-అప్‌గా మార్చండి ఇలా

PF Balance: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత జమైందో తెలుసా? ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవండి
First published: September 5, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading