కొత్త రూ.50 నోట్లు రిలీజ్ చేసిన ఆర్‌బీఐ... ప్రత్యేకతలు ఇవే

రూ.50 నోటుపై ఉర్జీత్ పటేల్ సంతకం ఉంటే అది పాత నోటే. ఒకవేళ ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటే తాజాగా రిలీజ్ చేసిన నోటుగా గుర్తించొచ్చు.

news18-telugu
Updated: April 17, 2019, 4:15 PM IST
కొత్త రూ.50 నోట్లు రిలీజ్ చేసిన ఆర్‌బీఐ... ప్రత్యేకతలు ఇవే
కొత్త రూ.50 నోట్లు రిలీజ్ చేసిన ఆర్‌బీఐ... ప్రత్యేకతలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్త రూ.50 నోట్లను రిలీజ్ చేసింది. మంగళవారం నుంచే చలామణిలోకి వచ్చాయి. కొత్త నోటుపై ఆర్‌బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.50 మహాత్మాగాంధీ కొత్త సిరీస్ నోటులాగే కొత్త రూ.50 నోటు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. "గతంలో ఆర్‌బీఐ విడుదల చేసిన రూ.50 విలువ గల నోట్లన్నీ చట్టపరంగా చెల్లుతాయి" అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 ఆగస్టులో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకంతో రూ.50 నోటును కొత్తగా రిలీజ్ చేసింది. ఇప్పుడు రిలీజైన నోటుపై ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం కనిపిస్తుంది.

రూ.50 నోటు ప్రత్యేకతలు ఇవే...రూ.50 నోటు 66 mm x 135 mm సైజులో ఉంటుంది.
ముందువైపు దేవనాగరి లిపిలో 50 సంఖ్య రాసి ఉంటుంది.
ముందువైపు మహాత్మాగాంధీ చిత్రం కనిపిస్తుంది.
ముందు, వెనుక వైపులో 50 సంఖ్య వాటర్ మార్క్ కనిపిస్తుంది.
సెక్యూరిటీ త్రెడ్‌పైన 'భారత్' అని రాసి ఉంటుంది.ముందువైపు కుడి భాగంలో అశోక పిల్లర్ ఎంబ్లమ్ ఉంటుంది.
నోటు ముద్రించిన సంవత్సరం నోటు వెనకభాగంలో ఎడమవైపు కనిపిస్తుంది.
కొత్త రూ.50 నోటుపై స్వచ్ఛ్ భారత్ లోగో ఉంటుంది.

రూ.50 నోటుపై ఉర్జీత్ పటేల్ సంతకం ఉంటే అది పాత నోటే. ఒకవేళ ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటే తాజాగా రిలీజ్ చేసిన నోటుగా గుర్తించొచ్చు. ఈ రెండు నోట్లు చట్టపరంగా చెల్లుతాయి.

Photos: కాలుష్యం కనిపిస్తే ఇలాగే ఉంటుంది... కళాకారుల ఊహాత్మక చిత్రాలు

ఇవి కూడా చదవండి:

Indian Railways: భారతీయ రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

FLIPKART TV Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఐపీఎల్ సేల్... టీవీలపై ఆఫర్లు

SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు
First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading