మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పేటీఎం, ఫోన్ పే లాంటి వ్యాలెట్స్ నుంచి తరచూ ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తుంటారా? నెలనెలా బిల్ పేమెంట్స్ చేస్తుంటారా? మీకు శుభవార్త. ఇకపై ఇలాంటి పేమెంట్స్‌కి ఆటోడెబిట్ సదుపాయాన్ని కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నిర్ణయం తీసుకుంది. తరచూ జరిపే పేమెంట్స్‌కి ఆటోడెబిట్ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే ఆటోమెటిక్ డెబిట్ ఆప్షన్ ఉండేది. ఇదే సదుపాయాన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పేటీఎం లాంటి మొబైల్ వ్యాలెట్స్‌కు కల్పించింది ఆర్బీఐ. కస్టమర్లకు ఇ-మ్యాండేట్ సదుపాయాన్ని కల్పించడానికి బ్యాంకులకు, వ్యాలెట్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు ఇ-మ్యాండేట్ సదుపాయం ఎంచుకున్నందుకు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
సెప్టెంబర్ 1 తర్వాత క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు ఆటోమెటెడ్ పేమెంట్స్ కోసం కార్డ్ జారీ చేసిన బ్యాంకులకు, సంస్థలకు ఇ-మ్యాండేట్ ఇవ్వొచ్చు. ఉదాహరణకు మీరు ప్రతీ నెల ఏదైనా రూ.1500 చెల్లింపు జరుపుతున్నారంటే ఇ-మ్యాండేట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రతీ నెల మీరు సూచించిన తేదీకి మీ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. ఇలా గరిష్టంగా రూ.2,000 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇ-మ్యాండేట్ సదుపాయం ఎంచుకోవడానికి డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మొదటిసారి పేమెంట్ చేస్తే, తర్వాతి పేమెంట్స్ అన్నీ ఆటోమెటిక్‌గా జరిగిపోతాయి. మొదటి పేమెంట్‌కు మాత్రమే ఆథెంటికేషన్ అవసరం. ఆటోమెటిక్‌గా జరిగే పేమెంట్స్‌కి ఆథెంటికేషన్ అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా ఆన్లైన్లోనే ఇ-మ్యాండేట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Top 10 Apps: ఇండియాలో టాప్-10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?
KBC Play Along: స్మార్ట్‌ఫోన్ ఉందా? కౌన్ బనేగా కరోడ్‌పతీ మీరూ ఆడొచ్చు ఇలా
Realme 5: మార్కెట్లోకి మరో బడ్జెట్స్మార్ట్ఫోన్ 'రియల్మీ 5'... ధర రూ.9999Published by:Santhosh Kumar S
First published:August 22, 2019, 15:07 IST