RBI New Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్

RBI New Rules | ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్‌కు కూడా ఆఫ్ చేయొచ్చు. అంటే మీ కార్డును ఎక్కడెక్కడ వాడాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఇలా నిర్ణయించుకునే అవకాశాన్ని యూజర్లకు ఇవ్వాలంటూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: January 17, 2020, 11:33 AM IST
RBI New Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్
RBI New Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీ డెబిట్ కార్డుతో పేమెంట్స్ చేస్తున్నారా? మీకు శుభవార్త. బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్త రూల్స్ ప్రకటించింది. కార్డు లావాదేవీల భద్రతను పెంచేందుకు, వినియోగదారులకు మేలు చేసేందుకు ఈ కొత్త రూల్స్ ఉపయోగపడతాయి. ప్రస్తుతం మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తీసుకుంటే ఆ కార్డును ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్, ఆన్‌లైన్ షాపింగ్ లావాదేవీల్లో ఉపయోగించొచ్చు. అన్ని లావాదేవీలకు అనుమతి ఇస్తూ మీకు బ్యాంకులు కార్డులు జారీ చేస్తుంటాయి. అయితే అందరూ అన్ని చోట్లా కార్డులను ఉపయోగించరు. అలాంటప్పుడు వాటిని ఆఫ్ చేసే అవకాశాన్ని ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అంటే మీరు మీ కార్డును అస్సలు ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉపయోగించనట్టైతే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్‌కు కూడా ఆఫ్ చేయొచ్చు. అంటే మీ కార్డును ఎక్కడెక్కడ వాడాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఇలా నిర్ణయించుకునే అవకాశాన్ని యూజర్లకు ఇవ్వాలంటూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.

కొత్తగా జారీ చేసే లేదా రీప్లేస్ చేసే కార్డులు కేవలం భారతదేశంలోని ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్‌లో మాత్రమే ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అంటే ఆ కార్డును ఆన్‌లైన్ షాపింగ్‌, కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ యూసేజ్ కోసం వాడాలంటే యూజర్లే ఆ ఫీచర్లను ఆన్‌ చేసుకోవాలి. అంతేకాదు ప్రతీ లావాదేవీ లిమిట్ ఎంతో మీరే సెట్ చేసుకోవచ్చు. 2020 మార్చి 16 నుంచి తీసుకునే ప్రతీ కార్డుకు ఈ ఫీచర్లు ఉండాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కార్డులకు రిస్కును బట్టి ఆప్షన్స్ మార్చాలని ఆర్‌బీఐ సూచించింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల్లో ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. కస్టమర్లు తమ కార్డును ఉపయోగించకుండా కొన్ని రోజులు ఆఫ్ చేయొచ్చు. లేదా అంతర్జాతీయంగా లేదా ఆన్‌లైన్ షాపింగ్ కోసం కార్డు వాడకుండా ఆఫ్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా మార్చుకోవచ్చు. అయితే ఇలాంటి ఆప్షన్స్ కొన్ని కార్డులకు మాత్రమే ఉన్నాయి. త్వరలో అన్ని కార్డులకు ఈ సెక్యూరిటీ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్యల్ని తీసుకుంటోంది.

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Best Smartphones: రూ.10,000 బడ్జెట్ లోపు బెస్ట్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Araku Tour: అరకు టూర్ తక్కువ ధరకే... ఐఆర్‌సీటీసీ నుంచి స్పెషల్ ప్యాకేజీ 

Aadhaar card: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఆన్‌లైన్‌లో చేయండి ఇలా
First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు