Free ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

Free ATM Transactions | హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ లాంటి సాంకేతిక కారణాల వల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినా, ఏటీఎంలో డబ్బులు లేకపోయినా, పిన్ తప్పుగా ఎంటర్ చేసినా వాటిని ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌లో లెక్కించొద్దని ఆర్‌బీఐ సూచించింది.

news18-telugu
Updated: August 15, 2019, 1:49 PM IST
Free ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
Free ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు తరచూ ఏటీఎంలో లావాదేవీలు జరుపుతుంటారా? డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్వెస్ట్ కోసం ఏటీఎంకు వెళ్తుంటారా? ఏటీఎం ఛార్జీల పేరుతో మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా? మీ అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సమాధానం ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్స్‌‌ని బ్యాంకులు ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ లెక్కలో వేస్తున్నట్టు ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది. అంతేకాదు... కార్డు స్వైప్ చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బులు లేకపోయినా ఆ లావాదేవీ జరిగినట్టు బ్యాంకులు గుర్తిస్తున్నాయి. ఆ లావాదేవీలను ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ లెక్కలో తగ్గిస్తున్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ లాంటి సాంకేతిక కారణాల వల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినా, ఏటీఎంలో డబ్బులు లేకపోయినా, పిన్ తప్పుగా ఎంటర్ చేసినా వాటిని ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌లో లెక్కించొద్దని ఆర్‌బీఐ సూచించింది. ఫ్రీ ట్రాన్సాక్షన్స్ దాటినవాళ్లు ఈ లావాదేవీలు జరిపినా ఛార్జీలు వేయొద్దని స్పష్టం చేసింది. అంతేకాదు... క్యాష్ విత్‌డ్రాయల్‌తో సంబంధం లేని బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్వెస్ట్, పన్నుల చెల్లింపులు, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ లాంటి లావాదేవీలు కూడా ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌ పరిధిలోకి రావని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్, అర్బన్ కో-ఆపరేటీవ్ బ్యాంక్స్, స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్‌తో పాటు అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు ఆర్‌బీఐ తాజా ఆదేశాలు వర్తిస్తాయి. ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

LIC Paid-up: ఎల్ఐసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా? పెయిడ్-అప్‌గా మార్చుకుంటే లాభాలివే

Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?Update Mobile Number: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ మార్చేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి
Published by: Santhosh Kumar S
First published: August 15, 2019, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading