సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 12 అమ్మకాలు మార్చి 1న ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి సిరీస్. ఈ గోల్డ్ బాండ్ అమ్మకాలు 2021 మార్చి 5న ముగుస్తాయి. ఈ సిరీస్‌కు ధరను ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBi. ఒక గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్ ధర రూ.4,662 అని ప్రకటించింది. ఆన్లైన్లో కొనేవారికి రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఒక గ్రాము బంగారాన్ని రూ.4,612 ధరకు కొనొచ్చు. ప్రతీ సారి గత మూడు రోజుల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛత గల బంగారానికి నిర్ణయించిన ధరను యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేస్తుంది ఆర్బీఐ. అంటే ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య ఉన్న బంగారం ధరను యావరేజ్ చేసి గ్రాముకు రూ.4,662 ధరను ఫిక్స్ చేసింది. ఈ సిరీస్‌లో గోల్డ్ బాండ్స్ కొన్నవారికి 2021 మార్చి 9న సెటిల్మెంట్ అవుతుంది.
ఫిజికల్ గోల్డ్ కొనకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్ మంచి అవకాశం. గోల్డ్ బాండ్ ఇటీవల ధరలు చూస్తే సిరీస్ 11 ధర రూ.4,912, సిరీస్ 10 ధర రూ.5,104, సిరీస్ 9 ధర రూ.5,000, సిరీస్ 8 ధర రూ.5,127, సిరీస్ 7 ధర రూ.5,051, సిరీస్ 6 ధర రూ.5,117 గా ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ ఈసారి మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గడంతో సావరిన్ గోల్డ్ బాండ్ ధర కూడా తగ్గింది. మార్చి సిరీస్‌కు రూ.4,662 ధరను ఫిక్స్ చేసింది ఆర్బీఐ.
Aadhaar Card: మీ ఆధార్ కార్డును ఎవరైనా ఉపయోగించారా? తెలుసుకోండి ఇలా
Gold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుంది
ఫిజికల్ గోల్డ్ కాకుండా సర్టిఫికెట్ రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్ మంచి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం కొన్నట్టే. కాకపోతే బంగారం చేతికి రాదు. సర్టిఫికెట్ రూపంలో ఉంటుంది. మార్కెట్లో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ పెరిగిపోతుండటంతో ఆ డిమాండ్‌ను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015లో ప్రారంభించింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో నెలకోసారి మొత్తం 12 సార్లు గోల్డ్ బాండ్స్ అమ్మకాలు ఉంటాయి.
Sleep Internship: రోజూ 9 గంటలు... 100 రోజులు నిద్రపోతే రూ.10,00,000 మీ సొంతం... అప్లై చేయండిలా
Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఈ 25 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటీ సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ట్రస్టులు, సంస్థలు 20 కిలోల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే 8 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉందో లెక్కించే అంతే ధర చెల్లిస్తారు. దీంతో పాటు ఏడాదికి 2.5 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లిస్తుంది ఆర్బీఐ. ఈ రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Investment Plans, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme