సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 5 సబ్స్క్కిప్షన్ ఆగస్ట్ 3న ప్రారంభం కానుంది. ఆగస్ట్ 7 వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. గ్రాముకు రూ.5,334 ఇష్యూ ధరను ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్లైన్లో కొనేవారికి రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.5,284 ధరకే ఒక గ్రాము బంగారం కొనొచ్చు. గత నెలలో జారీ చేసిన బాండ్లతో పోలిస్తే ఈసారి ధర కాస్త ఎక్కువగానే ఉంది. జూలైలో గోల్డ్ బాండ్‌కు ఒక గ్రాముకు రూ.4,852 ధర ఫిక్స్ చేసింది ఆర్బీఐ. ఈసారి ధర రూ.500 ఎక్కువగా ఉంది. అయినా మార్కెట్ ధరతో పోలిస్తే గోల్డ్ బాండ్ ధర తక్కువే. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,000 దాటింది. అదే గోల్డ్ బాండ్ 10 గ్రాములను రూ.52,840 ధరకే కొనొచ్చు. సుమారు రూ.3,000 తక్కువ.
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు విడతల్లో గోల్డ్ బాండ్స్ జారీ చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆగస్టులో 5వ సిరీస్ గోల్డ్ బాండ్స్ అమ్మకానికి వస్తున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవారు 8 ఏళ్లు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్ కావొచ్చు. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉంటే అంత గోల్డ్ బాండ్‌కు చెల్లిస్తారు. దీంతో పాటు ఏడాదికి 2.5 శాతం వడ్డీ కూడా చెల్లిస్తుంది ఆర్బీఐ. గోల్డ్ బాండ్స్‌ని బ్యాంకు, పోస్ట్ ఆఫీసుల నుంచి తీసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ కొన్న తర్వాత ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ట్రేడ్ చేయొచ్చు. బంగారాన్ని ఫిజికల్‌గా కాకుండా పేపర్ రూపంలో దాచుకోవాలనుకునేవారికి, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉపయోగకరం.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.