హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: అద్భుతమైన అవకాశం... మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం

Gold: అద్భుతమైన అవకాశం... మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం

Gold: అద్భుతమైన అవకాశం... మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం
(ప్రతీకాత్మక చిత్రం)

Gold: అద్భుతమైన అవకాశం... మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం (ప్రతీకాత్మక చిత్రం)

Sovereign Gold Bond Scheme | బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనండి ఇలా.

  బంగారం కొనాలనుకునేవారికి మరో అద్భుతమైన అవకాశం వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 9 ధర ఫిక్స్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతోంది ఆర్‌బీఐ. ఈసారి గ్రాముకు రూ.5,000 ధరను ఫిక్స్ చేసింది. గత నాలుగైదు నెలలతో పోలిస్తే బంగారం ధరలు కాస్త తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ ధరను కూడా కాస్త తగ్గించింది. గ్రాముకు రూ.5,000 మాత్రమే ఫిక్స్ చేసింది. 10 గ్రాములు గోల్డ్ బాండ్స్ తీసుకుంటే రూ.50,000 చెల్లిస్తే చాలు. ప్రస్తుతం మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,950. అంటే సావరిన్ గోల్డ్ బాండ్ రూ.950 తక్కువ ధరకే వస్తుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ తీసుకుంటే గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 10 గ్రాములపై ఏకంగా రూ.500 డిస్కౌంట్ పొందొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ 10 గ్రాములకు రూ.49,500 చెల్లిస్తే చాలు. ఈ లెక్కన మార్కెట్ ధరతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్ 10 గ్రాములకు రూ.1450 డిస్కౌంట్ లభించినట్టే.

  ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛమైన బంగారానికి నిర్ణయించిన ధరలను బట్టి సావరిన్ గోల్డ్ బాండ్ ధరలు ఉంటాయి. స్వచ్ఛమైన బంగారానికి గత మూడు బిజినెస్ డేస్‌లో ఉన్న ధరని యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేస్తుంది ఆర్‌బీఐ. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 9 ధరను గ్రాముకు రూ.5,000 ఫిక్స్ చేసింది. నవంబర్ 9 నుంచి 13 వరకు జరిగిన 8వ సిరీస్ సేల్‌కు ధరను రూ.5,177 ఫిక్స్ చేసింది ఆర్‌బీఐ. అంటే ఆ ధరతో పోల్చినా ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ ధర తక్కువే.

  Gold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుంది

  SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు

  మార్కెట్‌లో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించి పేపర్ గోల్డ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. దాదాపు ప్రతీ నెల సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు ఉంటాయి. వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటీ సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ట్రస్టులు, సంస్థలు అయితే ఏకంగా 20 కిలోల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతాయి.

  సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే 8 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉందో లెక్కించే అంతే ధర చెల్లిస్తారు. అంటే ఇప్పుడు ఓ వ్యక్తి రూ.1,00,000 చెల్లించి 20 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నాడనుకుందాం. 8 ఏళ్ల తర్వాత గ్రాముకు రూ.7,000 ఉంటే ఆ వ్యక్తికి 20 గ్రాముల బంగారానికి రూ.1,40,000 వస్తాయి. దీంతో పాటు ప్రతీ ఏటా 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో అమ్మొచ్చు. కొనొచ్చు. లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

  IRCTC PNR Status: ట్రైన్‌లో మీ బెర్త్ స్టేటస్ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు ఇలా

  SBI Credit Card Limit: మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోండి ఇలా

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI 2019-20 ఆర్థిక నివేదిక ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటివరకు 37 దశల్లో రూ.9,652.78 విలువైన 30.98 టన్నుల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10 సార్లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మితే రూ.2,316.37 విలువైన 6.13 టన్నులు కొన్నారు. 2020-21 సిరీస్ 9 సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు 2020 డిసెంబర్ 8న ప్రారంభమై 2021 జనవరి 5న ముగుస్తాయి. సిరీస్ 10 అమ్మకాలు 2021 జనవరి 11 నుంచి 15, సిరీస్ 11 అమ్మకాలు 2021 ఫిబ్రవరి 1 నుంచి 5, సిరీస్ 12 అమ్మకాలు మార్చి 1 నుంచి 5 వరకు జరుగుతాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme

  ఉత్తమ కథలు