RBI Report: ఒక్క నెలలో కార్డ్ పేమెంట్స్ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

RBI Report | 2021 చివరి నాటికి కార్డు లావాదేవీలు ప్రస్తుతం ఉన్న దానికన్నా ఆరు రెట్లు పెరుగుతాయని అంచనా. దీని ద్వారా నగదు వినియోగం తగ్గి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశముంది.

news18-telugu
Updated: May 19, 2019, 1:45 PM IST
RBI Report: ఒక్క నెలలో కార్డ్ పేమెంట్స్ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
RBI Report: ఒక్క నెలలో కార్డ్ పేమెంట్స్ ఎన్ని లక్షల కోట్లో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 19, 2019, 1:45 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కేవలం 2019 మార్చిలో డెబిట్ కార్డులతో రూ.5,30,111 కోట్లు, క్రెడిట్ కార్డులతో రూ.5,76,511 కోట్ల పేమెంట్స్ చేసినట్టు లెక్క తేలింది. గతేడాది మార్చిలో చూస్తే డెబిట్ కార్డులతో రూ.4,18,567 కోట్లు, క్రెడిట్ కార్డులతో రూ.443,081 కోట్లు పేమెంట్స్ జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 27 శాతం లావాదేవీలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 2019 మార్చి నాటికి 37.22 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ ఉన్నాయి. వాటిని 2021 నాటికి 50 లక్షలకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI టార్గెట్ పెట్టుకుంది. అంటే ప్రస్తుతం ఉన్నవాటి కన్నా 34 శాతం ఎక్కువ.

పీఓఎస్ టెర్మినల్స్ పెరిగితే షాపుల్లో, వ్యాపార కేంద్రాల్లో కార్డు లావాదేవీలు కూడా పెరుగుతాయి. ఫిజికల్ పీఓఎస్ టెర్మినల్స్‌తో పాటు డిజిటల్ పీఓఎస్ లేదా క్యూఆర్ కోడ్ సిస్టమ్‌ను కూడా డెవలప్ చేయాలని భావిస్తోంది ఆర్‌బీఐ. ఈ చర్యల ద్వారా 2021 చివరి నాటికి కార్డు లావాదేవీలు ప్రస్తుతం ఉన్న దానికన్నా ఆరు రెట్లు పెరుగుతాయని అంచనా. దీని ద్వారా నగదు వినియోగం తగ్గి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశముంది. అంతేకాదు... ఇ-కామర్స్ వ్యాపారాల్లో క్యాష్ ఆన్ డెలివరీ లావాదేవీలను కూడా డిజిటల్ మోడ్‌లోకి మార్చేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. వీటి ద్వారా నగదు డిమాండ్ తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా.

ఇక యూపీఐ, ఐఎంపీఎస్ లాంటి పేమెంట్ సిస్టమ్స్‌లో ఏటా 100 శాతం వృద్ధి కనిపిస్తోంది. నెఫ్ట్‌లో 40 శాతం వృద్ధి ఉంది. 2018 డిసెంబర్‌లో 2,069 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండగా, 2021 డిసెంబర్ నాటికి 8,707 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ అంచనా.

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే




ఇవి కూడా చదవండి:

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది
Loading...
Ola-SBI Credit Card: 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' వచ్చేసింది...

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...