Home /News /business /

RESERVE BANK OF INDIA IMPLEMENTING TOKENISATION RULES FROM 2022 JANUARY 1 FOR CREDIT CARD AND DEBIT CARD PAYMENTS KNOW HOW TO REGISTER SS

Tokenisation Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌కు కొత్త రూల్స్... మీరేం చేయాలంటే

Tokenisation Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌కు కొత్త రూల్స్... మీరేం చేయాలంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Tokenisation Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌కు కొత్త రూల్స్... మీరేం చేయాలంటే (ప్రతీకాత్మక చిత్రం)

RBI Tokenisation Rules | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం టోకెనైజేషన్ పద్ధతి అమల్లోకి తీసుకురానుంది. కార్డ్ హోల్డర్స్ ఏం చేయాలో తెలుసుకోండి.

    డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ (Credit Card) ద్వారా పేమెంట్స్ చేసేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సైబర్ నేరాలను అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ టోకెనైజేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. మామూలుగా అయితే కార్డ్ హోల్డర్లు పేమెంట్స్ చేయడానికి కార్డు వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయాలంటే పేమెంట్ కోసం కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ వివరాలు, సీవీవీ ఎంటర్ చేస్తారు. ఆ వివరాలు ఆ అకౌంట్‌లో సేవ్ అయి ఉంటాయి. అయితే ఎప్పుడైనా డేటా లీక్ అయినప్పుడు మీ కార్డు వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి.

    ఈ ముప్పు తప్పించేందుకు ఆర్‌బీఐ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకొస్తోంది. మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డును రీప్లేస్ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. మీరు మీ కార్డు వివరాలు ఎంటర్ చేయకుండా ఓ టోకెన్ మాత్రమే జారీ చేస్తారు. కార్డు, టోకెన్ రిక్వెస్టర్, డివైజ్ ద్వారా యూనిక్ కాంబినేషన్‌తో ఈ టోకెన్ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయాలనుకుంటే కార్డ్ వివరాలు ఎంటర్ చేయకుండా టోకెన్ వివరాలు మాత్రమే ఎంటర్ చేస్తారు. ఆ టోకెన్ ఆ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే పనిచేస్తుంది. అది కూడా మీరు కోరుకున్న డివైజ్ నుంచే పనిచేస్తుంది.

    SBI ATM: ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

    ఒకవేళ టోకెన్ వివరాలు ఇతరులకు తెలిసినా వాటిని ఉపయోగించలేరు. ఇలా మీరు రెగ్యులర్‌గా జరిపే పేమెంట్స్‌కి టోకెనైజేషన్ వాడుకోవచ్చు. మీరు కోరుకున్న వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి టోకెనైజేషన్ రిక్వెస్ట్ పంపాలి. సదరు మర్చంట్ మీ రిక్వెస్ట్‌ను బ్యాంకుకు పంపిస్తారు. ఆ తర్వాత టోకెన్ క్రియేట్ అవుతుంది. మీరు ఆ టోకెన్‌ను ఆ ప్లాట్‌ఫామ్‌లోనే ఉపయోగించొచ్చు. అంటే అమెజాన్‌లో క్రియేట్ చేసే టోకెన్ అమెజాన్‌లో మాత్రమే పనిచేస్తుంది.

    ప్రస్తుతం మర్చంట్స్ అందరూ టోకెనైజ్ కార్డ్స్ అంగీకరించట్లేదు. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే ఈ సదుపాయం కనిపిస్తోంది. త్వరలో మర్చంట్స్ అందరూ ఈ సదుపాయం ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరిపేట్టైతే ఇకపై కార్డు వివరాలు ఎంటర్ చేయకుండా టోకెనైజేషన్ పద్ధతి ఉపయోగించండి. మీ కార్డు వివరాలు సురక్షితంగా ఉంటాయి.

    Fake PAN Card: నకిలీ పాన్ కార్డును మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో గుర్తించండి ఇలా

    మీరు ఒకసారి టోకెన్ రిజిస్టర్ చేసిన తర్వాత డీరిజిస్టర్ కూడా చేయొచ్చు. లేదా ఒక ట్రాన్సాక్షన్‌లో ఎంత పేమెంట్ చేయాలో, డైలీ లిమిట్ ఎంతో కూడా మాడిఫై చేయొచ్చు. మీరు టోకెనైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత కూడా పేమెంట్ విధానం గతంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే పేమెంట్ పూర్తి చేయడానికి మీరు తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Credit cards, Debit card, Personal Finance, Rbi, Reserve Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు