హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ... హోమ్ లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుందో తెలుసుకోండి

RBI: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ... హోమ్ లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుందో తెలుసుకోండి

RBI: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ... హోమ్ లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుందో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

RBI: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ... హోమ్ లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుందో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెంచబోతున్నాయి. హోమ్ లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుందని లెక్కలేస్తున్నారు హోమ్ లోన్ కస్టమర్లు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూటు మార్చలేదు. అయితే కాస్తంత తీవ్రత తగ్గించింది. తాజాగా రెపో రేటులో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి కమర్షియల్‌ బ్యాంక్‌లకు 6.60 శాతం వడ్డీతో సెంట్రల్‌ బ్యాంక్‌ రుణాలు ఇస్తుంది. ఆర్‌బీఐ వరుసగా ఆరో సారి రెపో రేటును పెంచడంతో.. ఈ భారణం గృహ రుణాల నెలవారీ వాయిదాల (EMI)పై కనిపించనుంది. లోన్‌ ఈఎంఐలు 2 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. రెపో రేటు వంటి ఎక్స్‌టెర్నల్‌ బెంచ్‌మార్క్‌లతో లింక్‌ అయిన గృహ రుణాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది.

ఆర్బీఐ నిర్ణయంతో గృహ రుణాలు ఎందుకు ప్రభావితం అవుతాయి?

సాధారణంగా RBI రెపో రేటును పెంచినప్పుడు, అది బ్యాంకుల కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను పెంచుతుంది. బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకున్న రుణానికి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పర్యవసానంగా బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. దీంతో వినియోగదారుల EMIలు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునే వారికి వడ్డీ ఎక్కువగా ఉంటుంది, అంతక ముందే తీసుకున్న వారి ఈఎంఐలపై భారం పెరుగుతుంది.

IRCTC Bharat Gaurav Train: సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు... ప్యాకేజీ వివరాలివే

గృహ రుణ రేట్లలో ఎంత పెరుగుదల ఉంటుంది?

ఆర్బీఐ తాజా రెపో రేటు పెంపుతో గృహ రుణ గ్రహీతలపై ప్రభావం ఉంటుంది. గృహ రుణాల వడ్డీ మరింత పెరుగుతుంది. ఆండ్రోమెడ సేల్స్, అప్నాపైసా.కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి స్వామినాథన్ మాట్లాడుతూ సీఎన్‌బీసీ టీవీ18 న్యూస్‌పోర్టల్‌తో మాట్లాడుతూ.. 25 బేసిస్‌ పాయింట్లు రేటు పెంపు వల్ల ఈఎంఐలు దాదాపు 2-4 శాతం వరకు పెరుగుతాయి.

ఉదాహరణ ఓ వ్యక్తి 9.25 శాతం వద్ద రూ.70 లక్షల హోమ్‌ లోన్‌ 20 సంవత్సరాలకు తీసుకుంటే, EMI రూ.64,111 చెల్లించాలి. ప్రస్తుత 25 బేసిస్‌ పాయింట్ల పెంపును అప్లై చేస్తే.. వడ్డీ రేటు 9.50 శాతం అవుతుంది. దీంతో ఆ వ్యక్తి చెల్లించాల్సిన EMIని రూ.65,249కి పెరుగుతుంది. అంటే అదనంగా ప్రతి నెలా రూ.1,138 అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందని స్వామినాథన్‌ వివరించారు.

Exchange Offer: ఈ మొబైల్ కొంటే రూ.20,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

రుణగ్రహీతలు ఏం చేయాలి?

రుణగ్రహీతలు తమ రుణ వడ్డీని నియంత్రించడానికి ముందస్తు చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇది లోన్ కాలపరిమితి, EMIలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణ గ్రహీతలు తమ రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది లేదా లోన్‌ టెన్యూర్‌ని పొడిగించవలసి ఉంటుంది.

ఇంటి డిమాండ్ కూడా తగ్గుతుందా?

హౌసింగ్ రంగంపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం పరిమితంగానే ఉంది. నైట్ ఫ్రాంక్ ఆఫర్డబిలిటీ ఇండెక్స్‌(Knight Frank affordability index) గత సంవత్సరం కంటే సగటున 1.4 శాతం స్వల్పంగా క్షీణించింది. 2022 డిసెంబర్‌లో 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరంలో గృహ రుణాలకు డిమాండ్ బలంగా ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో గృహ కొనుగోళ్ల పట్ల వినియోగదారుల మనోభావాలను ఈ రేటు పెంపు ప్రతికూలంగా ప్రభావితం చేయదని నైట్ ఫ్రాంక్ భావిస్తోంది. సెంట్రల్ బ్యాంక్‌లు లేదా నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్‌ల నుంచి అధికారిక డేటాను తీసుకుని నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ రూపొందిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా ప్రధాన జాతీయ గృహ మార్కెట్ల పనితీరును ట్రాక్ చేస్తుంది.

First published:

Tags: House loan, Housing Loans, Personal Finance

ఉత్తమ కథలు