Home /News /business /

RESERVE BANK OF INDIA HIKES E MANDATE LIMIT FROM RS 5000 TO RS 15000 KNOW HOW E MANDATE WORKS SS

Card Payments: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త... ఆ లిమిట్ పెంపు

Card Payments: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త... ఆ లిమిట్ పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)

Card Payments: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త... ఆ లిమిట్ పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

Card Payments | క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, డెబిట్ కార్డ్ చెల్లింపుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇ-మ్యాండేట్ లిమిట్ పెంచింది.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIs) విషయంలో రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రతీ నెలా చెల్లింపుల కోసం ఇ-మ్యాండేట్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లిమిట్‌ను పెంచింది ఆర్‌బీఐ. ప్రస్తుతం రూ.5,000 గా ఉన్న లిమిట్‌ను రూ.15,000 చేసింది. ఇందుకు సంబంధించిన నియమనిబంధనల్ని ఆర్‌బీఐ విడుదల చేయనుంది. ఇ-మ్యాండేట్ రికరింగ్ పేమెంట్స్‌కు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ తప్పనిసరి. కస్టమర్లకు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. కస్టమర్లు ఆథెంటికేట్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.

అయితే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ లేకుండానే పేమెంట్ పూర్తయ్యేలా ఆర్‌బీఐ మార్పులు చేస్తోంది. చాలావరకు బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ సదుపాయం ఉపయోగించుకుంటున్న కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. ఇప్పటివరకు 6.25 కోట్ల మ్యాండేట్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం రూ.5,000 గా ఉన్న లిమిట్ పెంచాలని బ్యాంకుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఇన్స్యూరెన్స్ ప్రీమియం, పిల్లల స్కూల్ ఫీజు, ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కోసం లిమిట్ పెంచాలని బ్యాంకులు కోరాయి. బ్యాంకుల అభ్యర్థనలతో ఆర్‌బీఐ లిమిట్‌ను రూ.15,000 కి పెంచింది.

Breaking News: మళ్లీ షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ... ఈఎంఐలు మరింత భారం



అసలు ఇమ్యాండేట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారనుకుందాం. లేదా ఏదైనా ఇన్స్యూరెన్స్ కోసం ప్రతీ నెలా కొంత డబ్బులు చెల్లిస్తున్నారనుకుందాం. ఇలాంటి పేమెంట్స్ మీరు ప్రతీ నెలా తప్పకుండా చేయాల్సిందే. అయితే ప్రతీ నెలా ఒకే తరహా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకొని ఆ పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించిన ఇ-మ్యాండేట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది.

PAN Card: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? రూ.1,000 ఫైన్ తప్పించుకోవడానికి ఇలా చేయండి

ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఇ-మ్యాండేట్ క్రియేట్ చేసి మీరు ప్రతీ నెలా ఏ తేదీన ఎంత పేమెంట్ చేయాలో వివరాలు వెల్లడించాలి. ప్రస్తుతం గరిష్టంగా రూ.5,000 వరకు ఇ-మ్యాండేట్ క్రియేట్ చేయొచ్చు. ఆర్‌బీఐ తాజాగా రూ.15,000 కి పెంచింది. మీరు ఇ-మ్యాండేట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతీ నెలా మీరు సూచించిన తేదీలో డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.

ఇక ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి లింక్ చేయనుంది. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి లింక్ చేస్తే మీరు మీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతం కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మాత్రమే యూపీఐకి లింక్ అయ్యాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit cards, Debit cards, Digital payments, Personal Finance, Reserve Bank of India, Upi payments

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు