Home /News /business /

RESERVE BANK OF INDIA GIVES SHOCK TO THESE 3 BANKS HERE FULL DETAILS NS

RBI: ఆ మూడు బ్యాంకులకు షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్.. నగదు ఉపసంహరణపై ఆంక్షలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పలు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని కారణంగా భారీగా జరిమానాతో పాటు ఆంక్షలు విధించింది.

    పలు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని కారణంగా భారీగా జరిమానాతో పాటు ఆంక్షలు విధించింది. అనేక బ్యాంకులపై చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ తాజాగా మరో మూడు సహకార బ్యాంకులపై (Banks) కొరడా ఝులిపించింది. ఈ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం కారణంగా ఆయా బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సోలాపూర్‌ ది కర్మలా అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు, బాస్మత్‌నగర్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ నగరి కో ఆపరేటివ్‌ బ్యాంకుతో పాటు విజయవాడలోని దుర్గ కోఆపరేటివ్‌ ఆర్బన్‌బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఆయా బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన పరిమితికి మించి నగదును విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు.

    ది కర్మలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు రూ. 10వేల వరకు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నుంచి రూ. 1.5 లక్షల నగదు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అయితే.. ఆర్బీఐ ఆంక్షలు అమల్లో ఉన్న ఈ మూడు బ్యాంకులు రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవాలి. అలా చేస్తేనే.. ఆర్బీఐ తన ఆంక్షలను ఎత్తివేస్తుంది. ఒక వేళ బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగపర్చుకోని పరిస్థితుల్లో ఆంక్షలు మరికొన్ని రోజులు పొడిగించబడుతాయి.


    ఇంకా.. ఈ మూడు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ కు సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకోకుండా అప్పులు ఇవ్వడం, డిపాజిట్లు స్వీకరించడం, ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం లాంటివి చేయకూడదు. బ్యాంకు సరైన తీరులో పనిచేయడానికే ఈ ఆంక్షలు విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. ఆ ఆంక్షల నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank, Reserve Bank of India

    తదుపరి వార్తలు