హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Locker: బ్యాంక్ లాకర్‌ రెంట్‌కి తీసుకుంటున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Bank Locker: బ్యాంక్ లాకర్‌ రెంట్‌కి తీసుకుంటున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bank Locker: భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ లాకర్లకు సంబంధించిన నియమాలను మార్చింది. 2022 జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ దొంగతనాలు, దోపిడీలు జరగడం చూస్తున్నాం. ఇంట్లోని బీరువాలో దాచుకున్న నగలు, డబ్బును నేరస్థులు చోరీ చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగలపాలు కావడం ఎవరికైనా బాధను కలిగిస్తుంది. అందుకే చాలా మంది ప్రజలు ఆభరణాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌ వంటి విలువైన వస్తువులను స్టోర్‌ చేసుకోవడానికి బ్యాంకులలో సేఫ్ లాకర్ల(Safe Lockers)ను ఉపయోగిస్తారు. బ్యాంకుల వద్ద లాకర్లను పగలగొట్టి దొంగతనం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. అయితే కొత్తగా రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(Reserve Bank Of India) తీసుకొచ్చిన నియమాలతో బ్యాంక్‌ లాకర్లలో పోగొట్టుకున్న విలువైన వస్తువులకు కస్టమర్లు పరిహారం పొందవచ్చు. బ్యాంక్‌ లాకర్ల నిర్వహణకు ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నియమాలు ఏంటి, ఎలా అమలవుతాయనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* రక్షణ కల్పించేందుకు నియమాలు

2021లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ లాకర్లకు సంబంధించిన నియమాలను మార్చింది. 2022 జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఖరీదైన అసెట్స్‌ను దొంగతనాలు, దోపిడీల నుంచి రక్షించేందుకు, మరింత భద్రత కల్పించేందుకు బ్యాంక్ లాకర్ నియమాలను ఆర్‌బీఐ తీసుకొచ్చింది. ఇప్పుడు బ్యాంక్‌లో లాకర్‌ తీసుకొన్న వినియోగదారులకు లాకర్‌ను వినియోగించిన ప్రతిసారి ఇమెయిల్, మెసేజ్‌ ద్వారా సంబంధిత బ్యాంక్‌ అలర్ట్‌ పంపుతుంది. ఎటువంటి మోసాలకు తావు లేకుండా బ్యాంక్‌ చర్యలు తీసుకుంటుంది.

* మూడేళ్ల టైమ్ లిమిట్

మన దేశంలో కస్టమర్ ఎవరైనా గరిష్టంగా మూడేళ్ల కాలానికి లాకర్‌ను అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. లాకర్ అద్దె రూ.2000, ఇతర నిర్వహణ ఛార్జీలు మినహాయించి బ్యాంక్ రూ.6000 కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. బ్యాంకులో లాకర్‌ని పొందాలనుకునే కస్టమర్‌లు, మూడేళ్లపాటు లాకర్ రెంట్‌కు సమానమైన టర్మ్ డిపాజిట్‌ను చెల్లించాలి. బ్యాంకులు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ రెంట్‌ను ముందుగానే వసూలు చేయకూడదు.

ఇది కూడా చదవండి : రిటైర్ అయిన వారికి అలర్ట్.. రెగ్యులర్‌ ఇన్‌కమ్ కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ ఇవే..

* దొంగతనం జరిగితే పరిహారం

ఇంతకు ముందు లాకర్‌లోని వస్తువులు పోగొట్టుకుంటే బ్యాంకులు బాధ్యత వహించేవి కావు. బ్యాంకుల వద్ద లాకర్లను పగులగొట్టి చోరీ చేసిన ఘటనలు ఉన్నాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎలాంటి పరిహారం అందేది కాదు. ప్రస్తుతం ఆర్‌బీఐ నిబంధనల మేరకు.. కస్టమర్ బ్యాంక్ లాకర్ నుంచి ఏదైనా విలువైన వస్తువు చోరీ అయితే.. సంబంధిత బ్యాంక్‌ నుంచి పరిహారం అందుతుంది. బ్యాంకులు కస్టమర్‌కు వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.

* బ్యాంకుల బాధ్యత

సెక్యూర్‌ డిపాజిట్లు ఉన్న ప్రాంతానికి భద్రత కల్పించడం బ్యాంకుల బాధ్యత. బ్యాంకులు తమ తప్పిదాల వల్ల దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం వంటివి జరగకుండా చూసుకోవాలి. తమ ఆర్డర్‌లో ఖాళీ లాకర్ల జాబితా, లాకర్ వెయిటింగ్ లిస్ట్ నంబర్‌ను కూడా చూపించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. లాకర్ రూమ్‌లోకి వచ్చేవారిని, వెళ్లేవారిని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని ఆర్‌బీఐ పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీల డేటాను ఆరు నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bank, Personal Finance, Rbi

ఉత్తమ కథలు