EMI | రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ RBI ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసింది. నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. రినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్ రద్దు చేసిన్టుల ఆర్‌బీఐ వెల్లడించింది. రుణ (Loan) మంజూరులో అక్రమ పద్ధతులను పాటించడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఔట్ సోర్సింగ్, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ వంటి వాటిని ఈ ఫైనాన్స్ కంపెనీ అతిక్రమించిందని ఆర్‌బీఐ తెలిపింది.
రినో ఫైనాన్స్ కంపెనీ ఆన్‌లైన్‌లో రుణ మంజూరు ప్రక్రియలో నిబంధలను అతిక్రమించిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ ఫైనాన్స్ పలు థర్డ్ పార్టీ యాప్స్‌తో కలిసి కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. రూల్స్ అతిక్రమణ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం రినో ఫైనాన్స్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా ఈ ఫైనాన్స్ కంపెనీ కస్టమర్ల దగ్గరి నుంచి భారీగా వడ్డీని వసూలు చేస్తోందని, ఇంకా లోన్ రికవరీలో వేధింపులకు పాల్పడుతోందని ఆర్‌బీఐ తెలిపింది.
బంగారం కొనాలనుకుంటున్నారా? ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కేంద్రం కీలక ప్రకటన!
కాగా రినో ఫైనాన్స్ కంపెనీకి ఆర్‌బీఐ 2000 అక్టోబర్ 16న లైసెన్స్ అందించింది ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఇకపై ఈ ఫైనాన్స్ కంపెనీ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. అందువల్ల కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. లోన్ యాప్స్ బాధితులు పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే 330 కి.మి వెళ్లొచ్చు.. దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
కాగా రినో ఫైనాన్స్ కంపెనీ అనేది హెలో లోన్, క్రెడిట్ హబ్, కూకూ క్యాష్, ఫ్లాష్ లోన్, బ్రిడ్జ్ లోన్, క్రేజీ బీ, క్రెడిట్ వాలెట్, క్యాష్‌టీఎం, యూయూ క్యాష్, రూపీ ప్లస్, క్రెడిట్ రూపీ, క్యాష్ డాడీ, గెట్ రుపీ, క్యాషిన్, క్రెడిట్ క్లబ్, రుపీ బస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వాకా కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. అందువల్ల యాప్స్ ఉపయోగించే వారు అంటే ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న వారు ఈ విషయం గురించి తెలుసుకోవాలి.
కాగా ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఆర్‌బీఐ నుంచి అమనుతి పొందిన ఫైనాన్స్ కంపెనీలు ద్వారా నడిచే యాప్స్ ద్వారానే లోన్స్ తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధిక వడ్డీ భారం మోయాల్సి రావొచ్చు. ఇంకా వేధింపులకు గురికావాల్సి వస్తుంది. అందుకే ఆన్‌లైన్‌లోనే లోన్ యాప్స్ ద్వారా రుణం పొందే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. తర్వాత బాధపడాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, EMI, Loan apps, Rbi, Reserve Bank of India