Home /News /business /

RESERVE BANK OF INDIA CANCELS LAXMI COOPERATIVE BANK LICENCE KMV

RBI: ఖాతాదారులకు భారీ షాక్.. ఈసారి ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు!

 ఈ బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ భారీ షాక్.. లైసెన్స్ రద్దు!

ఈ బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ భారీ షాక్.. లైసెన్స్ రద్దు!

Bank Licence | ఆర్‌బీఐ షాకిచ్చింది. ప్రముఖ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Cooperative Bank | రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ (Bank licence) రద్దు చేసింది. ఆర్‌బీఐ మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం నేటి నుంచే అమలులోకి వస్తుందని రిజర్వు బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. మరి ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకున్న వారి పరిస్థితి ఏంటి? బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం వల్ల డిపాజిట్ దారులపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేకపోవడం, అలాగే ఆదాయ అంచనాలు కూడా లేకపోవడం కారణంగా బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. సోలాపూర్ కేంద్రంగా ఈ బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తూ వస్తోంది. సెప్టెంబర్ 22 నుంచే బ్యాంకింగ్ బిజినెస్‌పై ఆంక్షలు అమలులోకి వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. ఎయిర్‌టెల్ పండుగ గిఫ్ట్.. కస్టమర్లకు 5 జీబీ డేటా ఉచితం! మహరాష్ట్ర కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్‌ను ఎత్తివేయడానికి ఒక లిక్విడేటర్‌ను నియమించాలని పేర్కొంది. లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్‌ కార్యకలాపాలను అలాగే కొనసాగిస్తే.. రానున్న రోజుల్ల సాధారణ ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. అందుకే బ్యాంక్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసినట్లు వెల్లడించింది. బ్యాంక్ వద్ద డబ్బులు లేవని, బ్యాంక్‌లో డబ్బులు దాచుకున్న డిపాజిట్ దారులకు చెల్లించడానికి కావాల్సిన డబ్బులు కూడా లేవని ఆర్‌బీఐ పేర్కొంది. అందుకే బ్యాంక్ లైసెన్స్‌ను తప్పని పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆఫర్లంటే ఇవే.. ఈ ఫోన్లపై రూ.18 వేల భారీ తగ్గింపు! బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడం వల్ల ఇకపై లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ పని చేయదు. ఈ బ్యాంక్ కస్టమర్ల నుంచి డబ్బులు డిపాజిట్ చేయడం కోసం తీసుకోవద్దు. అలాగే డిపాజిట్లను తిరిగి చెల్లించకూడదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం బ్యాంక్ పలు నిబంధనలను అతిక్రమించిందని పేర్కొంది. కాగా డీఐసీజీసీ స్కీమ్ కింద దివాలా తీసిన బ్యాంక్ కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తారు. అయితే దీనికి ఒక లిమిట్ వరకే ఉంటుంది. అంటే గరిష్టంగా రూ. 5 లక్షల వరకు లభిస్తాయి. అటుపైన డబ్బులు ఎఫ్‌డీ చేసిన వారికి నష్టమే అని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా బ్యాంకుల లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది. వీటిల్లో చాలా వరకు అన్నీ కోఆపరేటివ్ బ్యాంకులే ఉన్నాయి. అందువల్ల మీరు ఇలాంటి బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ లైసెన్స్ రద్దు అయితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Banks, Rbi, Rbi governor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు