హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: మహీంద్రా ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ స్ట్రాంగ్ వార్నింగ్! అలా చేయడం ఆపేయాలంటూ ఆదేశాలు!

RBI: మహీంద్రా ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ స్ట్రాంగ్ వార్నింగ్! అలా చేయడం ఆపేయాలంటూ ఆదేశాలు!

 : ఈ ఫైనాన్స్ కంపెనీకి ఆర్‌బీఐ స్ట్రాంగ్ వార్నింగ్! ఆ సేవలు ఆపేయాలంటే ఆదేశాలు

: ఈ ఫైనాన్స్ కంపెనీకి ఆర్‌బీఐ స్ట్రాంగ్ వార్నింగ్! ఆ సేవలు ఆపేయాలంటే ఆదేశాలు

Loan | రిజర్వు బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీకి భారీ షాకిచ్చింది. లోన్ రికవరీ అంశంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. లోన్ రికవరీకి సంబంధించి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్‌బీఐ సీరియర్ అయ్యింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Mahindra Finance | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఝలక్ ఇచ్చింది. లోన్  (Loan) రికవరీ విషయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతులను అవలంభించొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆర్‌బీఐ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలను అనుసరించాలని పేర్కొంది.

అయితే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లోన్ రికవరీ సేవలను కొనసాగించొచ్చు. అయితే సొంత ఉద్యోగులతోనే లోన్ రికవరీ చేయించుకోవాల్సి ఉంటుంది. లోన్ రికవరీలో ఔట్ సోర్సింగ్ వారిని మాత్రం పెట్టుకోకూడదు. సెప్టెంబర్ 16న జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఒక ఫైనాన్స్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్ బలవంతంగా స్వాధీన చేసుకొని తీసుకెళ్తున్న ట్రాక్టర్ చక్రాల కింద పడి 27 ఏళ్ల గర్భిణి చనిపోయిందనే వార్త వచ్చింది.

ఖాతాదారులకు భారీ షాక్.. ఈసారి ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు

తర్వాత ఆ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ అనే విషయం తెలిసిందే. ఆ ట్రాక్టర్‌కు మహీంద్రా ఫైనాన్స్ లోన్ ఇచ్చిందని, తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించకపోవడంతో మహీంద్రా ఫైనాన్స్ ఏజెంట్లు ఆ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. ఆ ట్రాక్టర్ కింద పడి గర్భిణి చనిపోయింది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.

పండుగ సీజన్‌లో బైక్ , స్కూటర్ కొనాలనుకునే వారికి షాక్..

కాగా చాలా మంది లోన్ రికవరీ ఏజెంట్ల వల్ల బాధపడుతున్నారనే విషయం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లోన్ యాప్స్‌పై కీలక విషయాన్ని వెల్లడించారు. ఇల్లీగల్ లోన్ యాప్స్ ఇకపై గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండవు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ ఒక వైట్ లిస్ట్‌ను తయారు చేస్తోంది. ఇందులో ఉన్న లోన్ యాప్స్ మాత్రమే గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటాయి.

అలాగే ఆర్‌బీఐ ఇటీవలనే లోన్ రికవరీ అంశానికి సంబంధించి కొత్త రూల్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని అతిక్రమిస్తే.. ఎన్‌బీఎఫ్‌సీలు లేదంటే ఇతర ఫైనాన్స్ సంస్థలపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే లోన్ యాప్స్ వేధింపుల కారణంగా చాలా మంది మరణించారు. అందుకే ఇటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, అటు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త రూల్స్ తీసుకువస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆప్షన్లను ఉపయోగించుకుంటున్నారు.  అయినా కూడా లోన్ యాప్స్, లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మాత్రం పూర్తిగా ఆగిపోవడం లేదు.

First published:

Tags: Loan apps, Mahindra and mahindra, Money, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు