హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Bank: కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వకండి... HDFC బ్యాంకుకు RBI షాక్

HDFC Bank: కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వకండి... HDFC బ్యాంకుకు RBI షాక్

HDFC Bank కూడా తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తోంది. 10.75 శాతం నుంచి 21.30 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అయితే, ఇందులో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఎంత వడ్డీ పడుతుందనేది ముందు చెక్ చేసి తీసుకోవాలి.  (ప్రతీకాత్మక చిత్రం)

HDFC Bank కూడా తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తోంది. 10.75 శాతం నుంచి 21.30 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అయితే, ఇందులో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఎంత వడ్డీ పడుతుందనేది ముందు చెక్ చేసి తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI షాకిచ్చింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని లాంఛ్ చేయొద్దని ఆదేశించింది. ఎందుకో తెలుసుకోండి.

మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో క్రెడిట్ కార్డుకు అప్లై చేశారా? అయితే మీకు ఇప్పట్లో క్రెడిట్ కార్డు రాకపొవచ్చు. కొత్తగా క్రెడిట్ కార్డ్ కస్టమర్లను తీసుకోవద్దని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును కోరింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఇందుకు కారణం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ సేవల్లో గత రెండేళ్లుగా తరచూ అంతరాయం కలుగుతుండటమే. నవంబర్ 21న హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది. బ్యాంకుకు చెందిన ప్రైమరీ డేటా సెంటర్‌లో పవర్ ఫెయిల్యూర్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. ఇలాంటి అంతరాయాలను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2న ఆర్‌బీఐ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మొదట డిజిటల్ 2.0 ద్వారా ప్రారంభించాలనుకుంటున్న అన్ని డిజిటల్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్‌బీఐ కోరింది. దీంతో పాటు కొత్త క్రెడిట్ కార్డ్ కస్టమర్లను తీసుకోవద్దని సూచించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బోర్డు లోపాలను పరిశీలించి, సమస్యల్ని పరిష్కరించాలని సూచించింది.

WhatsApp New Features: వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ చాలా సింపుల్... చేయండి ఇలా

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తీసుకునే చర్యలను బట్టి ఆర్‌బీఐ ఈ నియంత్రణల్ని ఎత్తేసే అవకాశముంది. అయితే ఐటీ వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు కావాల్సిన చర్యల్ని తీసుకుంటున్నట్టు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లకు ఫైలింగ్‌లో వివరించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. అయితే ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఉఫయోగిస్తున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆర్‌బీఐ సూచనలు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెబుతోంది. కస్టమర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

Post Office Savings Account: ఖాతాదారులకు అలర్ట్... మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారాయి

Job Loss Insurance: ఉద్యోగం పోతే ఇన్స్యూరెన్స్... వారానికి రూ.1,00,000 వరకు బెనిఫిట్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు పలుమార్లు డిజిటల్ సేవల్లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఇతర లావాదేవీల్లో అంతరాయం కలుగుతోంది. పేమెంట్స్‌లో సమస్యలు వచ్చాయని కస్టమర్లు నవంబర్ 21న కస్టమర్లు కంప్లైంట్ చేశారు. ఈ సమస్య 12 గంటలపాటు ఉంది. నవంబర్ 22 ఉదయం వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఓ డేటా సెంటర్‌లో అనుకోకుండా అంతరాయం కలిగిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వివరించింది. 2019 డిసెంబర్ 3న కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. కస్టమర్లు లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయారు. అప్పుడు సాంకేతిక సమస్య తలెత్తిందని బ్యాంకు వెల్లడించింది.

(ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)

First published:

Tags: Bank, Bank account, Hdfc, HDFC bank, Mobile Banking, Personal Finance, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు