రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ విషయంలో కొత్త రూల్స్ ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఇష్యూయెన్స్ అండ్ కండక్ట్ డైరెక్షన్స్ 2022 పేరుతో ఈ రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ 2022 జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. క్రెడిట్ కార్డ్ (Credit Card) అకౌంట్ క్లోజ్ చేసే విషయంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవు. బ్యాంకులు కార్డ్హోల్డర్లకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అసలు ఆర్బీఐ ప్రకటించిన రూల్స్ ఏంటీ? కస్టమర్లు ఏం తెలుసుకోవాలి? బ్యాంకులు ఏ రూల్స్ పాటించాలి? తెలుసుకోండి.
ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటే ఏడు వర్కింగ్ డేస్‌లో ఆ రిక్వెస్ట్‌ను బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ క్లోజర్ గురించి కార్డ్ హోల్డర్‌కు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేయడం కోసం కార్డ్ హోల్డర్ వేర్వేరు పద్ధతుల్లో రిక్వెస్ట్ చేసే అవకాశం కల్పించాలి.హెల్ప్‌లైన్, ఇమెయిల్ ఐడీ, ఐవీఆర్, వెబ్సైట్లో లింక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లో ఈ ఆప్షన్స్ ఇవ్వాలి.
Tirupati Special Trains: సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
కార్డ్-జారీ చేసేవారు పోస్ట్ లేదా ఏదైనా ఇతర మార్గాల ద్వారా క్రెడిట్ కార్డ్ క్లోజర్ రిక్వెస్ట్‌ను పంపాలని పట్టుబట్టకూడదు. ఒకవేళ ఏడు పనిదినాల్లోగా క్రెడిట్ కార్డ్‌ను మూసివేసే ప్రక్రియలో బ్యాంకులు విఫలమైతే, కస్టమర్‌కు ఆలస్యమైన ప్రతీ రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి. అయితే క్రెడిట్ కార్డ్ అకౌంట్లో ఎలాంటి బకాయి లేకపోతేనే ఈ రూల్ వర్తిస్తుంది.
EPFO Alert: ఈపీఎఫ్ఓ నుంచి త్వరలో గుడ్ న్యూస్... ఆ లిమిట్ పెంచనున్న బోర్డు
ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డ్ ఉపయోగించకుంటే, కార్డ్ హోల్డర్‌కు సమాచారం అందించి క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను మూసివేసే ప్రక్రియ ప్రారంభించాలి. 30 రోజుల వ్యవధిలోగా కార్డ్ హోల్డర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ చేయాలి. కార్డ్ జారీచేసిన బ్యాంకు లేదా సంస్థ 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ క్లోజర్‌కు సంబంధించిన వివరాలు అప్డేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ అకౌంట్లో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటే, కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit card, Credit cards, Personal Finance, Rbi, Reserve Bank of India