హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Holidays 2023: వచ్చే ఏడాది బ్యాంకులకు 21 సెలవులు... తేదీలు ఇవే

Bank Holidays 2023: వచ్చే ఏడాది బ్యాంకులకు 21 సెలవులు... తేదీలు ఇవే

Bank Holidays 2023: వచ్చే ఏడాది బ్యాంకులకు 21 సెలవులు... తేదీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays 2023: వచ్చే ఏడాది బ్యాంకులకు 21 సెలవులు... తేదీలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays 2023 | మరో 16 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. వచ్చే ఏడాది బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. మొత్తం 21 సెలవులు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

నిత్యం లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లేవారు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ (Banking Transactions) ఎక్కువగా చేసేవారు బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతీ ఏడాది సెలవుల వివరాలను ముందుగానే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తుంది. 2023 సంవత్సరంలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో 2023 హాలిడేస్ (2023 Holidays) అప్‌డేట్ చేసింది. మరి వచ్చే ఏడాది హైదరాబాద్ రీజియన్‌లో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.

2023 బ్యాంక్ హాలిడేస్ వివరాలివే...

జనవరి 26- రిపబ్లిక్ డే

ఫిబ్రవరి 18- మహాశివరాత్రి

మార్చి 7- హోళీ

మార్చి 22- గుడి పడ్వా, ఉగాది

మార్చి 30- శ్రీరామనవమి

ఏప్రిల్ 1- బ్యాంక్స్ ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ డే

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 22- రంజాన్

మే 1- మే డే

జూన్ 29- బక్రీద్

జూలై 29- మొహర్రం

ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే

సెప్టెంబర్ 7- శ్రీకృష్ణ జన్మాష్టమి

సెప్టెంబర్ 18- వినాయక చవితి

సెప్టెంబర్ 28- ఈద్ ఏ మిలాద్

అక్టోబర్ 2- మహాత్మా గాంధీ జయంతి

అక్టోబర్ 24- దసరా

నవంబర్ 27- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి

డిసెంబర్ 25- క్రిస్మస్

LIC Alert: పాలసీ ఉన్నవారికి ఎల్ఐసీ హెచ్చరిక... ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్

బ్యాంకులకు 21 సెలవులు వచ్చాయి. ఈ సెలవులు కాకుండా సాధారణ సెలవులు ఉంటాయి. ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు తెరచుకోవు. ఈ సెలవులు సాధారణంగా ప్రతీ నెలలో 6 లేదా 7 వస్తాయి. ఇవి కాకుండా పైన వివరించిన పబ్లిక్ హాలిడేస్ అదనం. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలు వాడుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

RBI Alert: ఖాతాదారులకు ఊరట... ఇక ఆ పని కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు

బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లో తెలుసుకోవచ్చు. ఈ లింక్‌లో సర్కిల్స్ వారీగా సెలవుల జాబితా ఉంటుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవాలంటే హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేసి, నెల సెలెక్ట్ చేయాలి.

First published:

Tags: Bank Holidays, Banking, Banking news, Holidays, Personal Finance, Reserve Bank of India

ఉత్తమ కథలు