అపార్టుమెంట్లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో వెచ్చించాల్సిందే. అలాంటి సమయంలో పాత ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి.
అపార్టుమెంట్లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో వెచ్చించాల్సిందే. అలాంటి సమయంలో పాత ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి.
అపార్టుమెంట్లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో వెచ్చించాల్సిందే. అలాంటి సమయంలో పాత ఫ్లాట్‌నే కొనుగోలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. లేని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత ఫ్లాట్‌ను కొనుగోలు చేసే ముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలంటే..
వాస్తవ యజమాని: పాత ఫ్లాట్‌ను కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరుమీద ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవాలి. అన్ని పేపర్లను న్యాయ నిపుణులకు చూపడం మంచిది. ఆ ప్రాపర్టీ ప్రభుత్వ రికార్డుల్లో సరిగ్గా నమోదయిందో లేదో కూడా చూసుకోవాలి. అమాయకంగా ఉండే వారికి తప్పుడు పత్రాలు చూపి ఫ్లాట్‌ను విక్రయించే ఉదంతాలకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్రాపర్టీకి సంబంధించిన బకాయిలను కూడా పరిశీలించాలి. విద్యుత్, నల్లా బిల్లులతోపాటు ప్రాపర్టీ టాక్స్‌కు సంబంధించిన బకాయిలు ఉన్నవీ లేనిదీ చూసుకోవాలి. మెయింటెనెన్స్, ఎలక్ర్టిసిటీ, నీటి బిల్లులకు సంబంధించిన బకాయిల వివరాలను బిల్డరు లేదా సొసైటీ ద్వారా తెలుసుకోవచ్చు. పన్నుకు సంబంధించిన వివరాలను మున్సిపాలిటీ లేదా రెవెన్యూ విభాగం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
రుణ వివరాలు: ఇళ్లు/ఫ్లాట్‌ను కొనుగోలు చేసే వారిలో చాలా మంది బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. పాత ఫ్లాట్‌ను కొనుగోలు చేసే వారు ఆ ఫ్లాట్‌కు సంబంధించి బ్యాంకు నుంచి ఏమైనా రుణం తీసుకున్నారా లేదా తెలుసుకోవాలి. కొంత మంది ఫ్లాట్‌ను తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి వేమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ బ్యాంకు రుణంతో ఫ్లాట్ వారీ వాయిదాలు సక్రమంగా చెల్లించిదీ లేనిదీ చూడాలి. సంబంధిత బ్యాంకు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను పొందడం మంచిది.
నిర్వహణ అంశాలు: పాత ఫ్లాట్‌కు సంబంధించిన నిర్వహణ ఖర్చులు తక్కువగానే ఉంటాయి. అయితే ఈ వివరాలు కూడా ముందే తెలుసుకోవడం మంచిది. కామన్ ఏరియాకు ఎంత మొత్తం చెల్లించాలి, లిఫ్ట్ ఉంటే ఎంత మొత్తం భరించాల్సి ఉంటుందో చూసుకోవాలి. పాత ఫ్లాట్ కొనే సందర్భంలో దాని నిర్మాణం, బిల్డింగ్ ప్లాన్ ను పరిశీలించాలి. గోడలకు పగుళ్లు ఏమైనా ఉన్నాయా, వర్షం పడినప్పుడు ఇంటి లోపలివైపు ఏమైనా తేమ వస్తున్నదీ లేనిదీ కచ్చితంగా పరిశీలించాలి. గోడల పటుత్వంతోపాటు విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్కు సంబంధించిన విషయాల్లోనూ కాస్త శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్లోర్ ఎంపిక: పాత అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఏ ఫ్లోర్ అయితే బాగుంటుందో ముందే ఆలోచించాలి. పై ఫ్లోర్లో ఉంటే మంచి గాలి, వెలుతురు వస్తుంది కాబట్టి విద్యుత్ బిల్లు ఆదా కావడానికి అవకాశం ఉంటుంది. కింది ఫ్లోర్లో ఉంటే వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. గాలి ఆడటం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఫ్యాన్లను వాడాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యుత్ బిల్లులు పెరిగిపోతాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.