• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • REPUBLIC DAY 2021 INDIAS COLOURFUL HERITAGE COMES ALIVE IN GOOGLES REPUBLIC DAY DOODLE NK

Google's Republic Day Doodle: గూగుల్ రిపబ్లిక్ డే డూడుల్ అదిరిపోయిందిగా...

Google's Republic Day Doodle: గూగుల్ రిపబ్లిక్ డే డూడుల్ అదిరిపోయిందిగా...

గూగుల్ రిపబ్లిక్ డే డూడుల్ అదిరిపోయిందిగా... (image courtesy - google)

Google's Republic Day Doodle: గూగుల్ మరోసారి దుమ్మురేపింది. బ్రహ్మాండమైన డూడుల్‌తో ఇండియా రిపబ్లిక్ డేకి సలాం కొట్టింది. ఆ డూడుల్ మీనింగ్ తెలుసుకుందాం.

  • Share this:
    Republic Day 2021: భారతదేశం అంటేనే రకరకాల కళలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు, భాషల సమ్మేళనం. అందువల్ల భారత్‌కి సంబంధించిన అంశాలపై డూడుల్ తయారుచేయాలంటే మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. ఈసారి కూడా గూగుల్ చక్కటి డూడుల్ చేసింది. జాతీయ జెండా రంగులను డూడుల్‌లో ప్రతిబింబిస్తూనే... సాంస్కృతిక వారసత్వాన్ని చూపించింది. ప్రధానంగా ఇండియాలో కళలు, కళాఖండాలు, సంస్కృతి, పల్లెలు అన్నింటినీ ఈ డూడుల్‌లో మనం చూడవచ్చు. పాత చారిత్రక భవనాలు, అప్పటి ఆర్ట్ వర్క్ షోకేస్ చేసింది గూగుల్. అలాగే... కాషాయరంగును బ్యాక్‌డ్రాప్‌లో సెచ్ చేసింది. ప్రజల ముందు గ్రీన్ కలర్ వేసింది. కంపెనే పేరును మధ్యలో ఉంచింది.

    ఈసారి Googleలో రెండో Oను ఏనుగు అంబారీగా వేసి... సృజనాత్మకతను చాటుకుంది గూగుల్. అలాగే... రెండో G దగ్గర ఏనుగును ఓ వ్యక్తి వీడియో షూట్ చేస్తున్నట్లుగా ఆర్ట్ వేశారు. అలాగే... చివరి Eలో ఓ మహిళ తొంగి చూస్తున్నట్లు వేశారు. వివిధ మతాల వారు, వివిధ రకాల ప్రజలు అందరూ ఉండేలా వేసిన ఈ ఆర్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

    Republic Day 2021, Happy Republic Day, Republic Day Parade, Republic day images, Republic day wishes, Republic day quotes, Republic day Speech, Republic day message, Republic day flag hoisting, Republic day theme, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం,
    గూగుల్ రిపబ్లిక్ డే డూడుల్ అదిరిపోయిందిగా... (image courtesy - google)


    ఇదే కాదు ఇదివరకు కూడా గూగుల్ ఏటా... ఇలాంటి ఎన్నో అద్భుతమైన డూడుల్స్ వేసింది. వాటిని ఓసారి చూద్దాం.















    ఇది కూడా చదవండి: Money Mantra: రోజూ ఈ మంత్రం జపిస్తే డబ్బే డబ్బు... అప్పులు, ఆర్థిక సమస్యలూ పరార్
    మొత్తానికి కరోనా వదిలిపోతున్న సమయంలో జరుగుతున్న ఈసారి రిపబ్లిక్ డేకి మంచి స్పందన వస్తోంది. ఎన్నో పండగలను వదిలేసుకున్న ప్రజలు దీన్ని కాస్త ఆసక్తిగా జరుపుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు