హోమ్ /వార్తలు /business /

LIC IPO: ఆ నెలలోనే ఎల్ఐసీ ఐపీఓ.. తాజా అప్‌డేట్ ఇదే..

LIC IPO: ఆ నెలలోనే ఎల్ఐసీ ఐపీఓ.. తాజా అప్‌డేట్ ఇదే..

మార్చి నెల మధ్యలో ఎల్ఐసీ ఐపీవో (LIC IPO) రానుంది. ఈ మేరకు తాజాగా నివేదికలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

మార్చి నెల మధ్యలో ఎల్ఐసీ ఐపీవో (LIC IPO) రానుంది. ఈ మేరకు తాజాగా నివేదికలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

మార్చి నెల మధ్యలో ఎల్ఐసీ ఐపీవో (LIC IPO) రానుంది. ఈ మేరకు తాజాగా నివేదికలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

  ఎల్‌ఐసీ (LIC) పబ్లిక్‌ ఇష్యూ జారీకి సంబంధించిన ఏర్పాట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేతృత్వంలో జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లకు చేరువ కావాలంటే ఈ ఇష్యూ కీలకం కానుంది. ఎల్‌ఐసీ ఇష్యూ మార్చి మధ్యలో మార్కె ట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం తన వాటాలను ఎంత మేరకు విక్రయించాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఫబ్లిక్‌ ఇష్యూ కంటే ముందే ఎల్‌ఐసీ ఐపీఓపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లుండేలా చూడాలని ప్రభుత్వం (Central Government) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఈ నెల చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు.

  LIC IPO Alert: ఎల్ఐసీ పాలసీ ఉందా? ఐపీఓలో కోటా కావాలంటే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

  మార్చిలోగా మార్కెట్‌కు వచ్చే ఈ భారీ ఐపీఓ భారత చరిత్రలో అతి పెద్ద ఐపీఓ కానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్చి 31లోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇష్యూ సక్సెస్ అయితే సర్కార్ కు రూ. లక్ష కోట్ల ఆదాయం లభిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీ ఇష్యూ కోసం కేంద్రం గత సెప్టెంబరులో 10 మంది మర్చంట్‌ బ్యాంకర్లను నియమించింది. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్ ను లీగల్‌ అడ్వైజర్‌గా నియమించింది.

  Tata Elxsi: టాటాకు చెందిన ఈ కంపెనీలో షేర్లను కొనుగోలు చేసిన LIC...మీరు కూడా ఓ లుక్కేయండి...

  ఎల్‌ఐసి ఐపిఒ పబ్లిక్ షేర్లను మార్చి మధ్యలో జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంతో ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. LIC యొక్క IPO భారతదేశంలో అతిపెద్ద IPO అవుతుంది. బీమా కంపెనీలో వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం 90,000 కోట్లు సంపాదించాలనుకుంటోంది. అదే సమయంలో, బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, LIC IPO విలువ రూ. 15 లక్షల కోట్లుగా ఉంటుంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  ఉత్తమ కథలు