ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) ఇన్వెస్టర్‌లకు సెబీ (SEBI) మరిన్ని ప్రయోజనాలు అందిస్తోంది. సెటిల్‌మెంట్ సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లు అన్ని స్టాక్స్‌కు T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కి మారాయి. ఇంతకుముందున్న సెటిల్‌మెంట్ సైకిల్‌ను ఒక రోజు తగ్గించాయి. దీంతో ప్రస్తుతం ఉన్నదానికంటే ఒక రోజు ముందుగానే ఫండ్స్ అందుబాటులోకి వస్తాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ఈ ప్రయోజనాన్ని అందించడానికి, అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు) ఈక్విటీ స్కీమ్స్‌కి T+2 రిడెంప్షన్ పేమెంట్ సైకిల్‌కి మారాలని నిర్ణయించాయి. 2023 ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమలు చేయనున్నాయి.
* ఫిబ్రవరి 1 నుంచి అమలు?
తాజా నిబంధనలు 2023 ఫిబ్రవరి 1న కట్ ఆఫ్ టైమింగ్‌కు ముందు స్వీకరించిన అన్ని ట్రాన్సాక్షన్‌లకు అమలవుతాయి. సెటిల్‌మెంట్ సైకిల్/ప్రాసెస్‌ని స్థిరీకరించడానికి రెండు రోజుల సమయం ఇచ్చిన తర్వాత 2023 ఫిబ్రవరి 1కి NAVని క్లోజ్ చేసే సమయంలో ప్రాసెస్ అవుతాయి. భారతదేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ సెటిల్‌మెంట్ కోసం మూడు రోజులు పట్టే మునుపటి T+3 సెటిల్‌మెంట్ సైకిల్‌కు బదులుగా ఇప్పుడు T+2 సైకిల్‌ను అనుసరిస్తాయి.
* AMFI పరిధిలో 44 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు
ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వృత్తిపరమైన, ఆరోగ్యకరమైన, నైతిక మార్గాలను అభివృద్ధి చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్, వాటి యూనిట్ హోల్డర్స్ ప్రయోజనాలను రక్షించడం, ప్రోత్సహించడం కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) పని చేస్తుంది. అన్ని రంగాలలో ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. 1995 ఆగస్టు 22న లాభాపేక్ష లేని సంస్థగా AMFI ఏర్పాటైంది. ఇది SEBI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్. AMFI సెబీలో రిజిస్టర్ అయిన మొత్తం 44 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు దాని కింద ఉన్నాయి.
ఇది కూడా చదవండి : ఏడాదికి రూ.1999 కడితే చాలు.. ఓలా కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు..
* నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, ఛైర్మన్, AMFI MD & CEO బాలసుబ్రమణియన్ సీఎన్‌బీసీ న్యూస్ పోర్టల్‌తో మాట్లాడుతూ.. ప్రపంచంలో మొదటిసారిగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ T+1 సెటిల్‌మెంట్ సైకిల్ అమలు చేస్తున్నాయన్నారు. ఒక పరిశ్రమగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనాన్ని అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈక్విటీ ఫండ్స్‌కి T+2 రిడెంప్షన్ పేమెంట్ సైకిల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పారు.
AMFI చీఫ్ ఎగ్జిక్యూటివ్ NS వెంకటేష్ మాట్లాడుతూ.. AMFI, దాని సభ్య AMC లు ఎల్లప్పుడూ పెట్టుబడిదారుల ఆసక్తికి ప్రాధాన్యం ఇస్తాయన్నారు. SEBI ఈక్విటీ మార్కెట్స్‌కు T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కి దశలవారీగా అమలు చేయాలని ప్రకటించినప్పటి నుంచి, రిడెంప్షన్ పేమెంట్ సైకిల్ తగ్గించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి T+2 రిడెంప్షన్ పేమెంట్ సైకిల్‌కు మారుతున్నట్లు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mutual Funds, Personal Finance