Financial Tips: మీ హోం లోన్ తీర్చేశారా..? తర్వాత నెల ఈఎంఐ డబ్బులను ఇలా పొదుపు చేయండి..

ప్రతీకాత్మకి చిత్రం

Financial Tips: సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చాలామంది ప్రజలు హోం లోన్స్ (Home Loans) తీసుకుంటుంటారు. హోమ్​లోన్ (Home Loan)​ తీసుకున్న అనంతరం ప్రతి నెల రూ.వేలల్లో వాయిదా కట్టాల్సి ఉంటుంది.హోం లోన్ మొత్తం తీర్చేసిన తర్వాత రుణగ్రహీతలకు చాలా భారం తగ్గుతుంది.

  • Share this:
సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చాలామంది ప్రజలు హోం లోన్స్ (Home Loans) తీసుకుంటుంటారు. హోమ్​లోన్ (Home Loan)​ తీసుకున్న అనంతరం ప్రతి నెల రూ.వేలల్లో వాయిదా కట్టాల్సి ఉంటుంది.హోం లోన్ మొత్తం తీర్చేసిన తర్వాత రుణగ్రహీతలకు చాలా భారం తగ్గుతుంది. ఇంటి అప్పు భారం దించుకోవడంతో ఈఎంఐ కట్టాల్సిన పని ఉండదు. అలాగే ఈ ఈఎంఐ (EMI)కి సమానమైన డబ్బులు బ్యాంకుల్లో వృధాగా పడి ఉంటాయి. ఆ నగదును ఎలా పెట్టుబడి పెట్టాలి? ఆ డబ్బుతో ఏం చేయాలి? అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికోసం ఆర్థిక నిపుణులు విలువైన సలహాలు ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.
హోం లోన్ ఇచ్చేసిన తర్వాత చెయ్యాల్సింది ఇదే..
రియల్ ఎస్టేట్పై(Real Estate) మక్కువతో చాలామంది ప్రజలు మళ్ళీ హోం లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమే. కానీ మరో ఇల్లు కోసం లోన్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదు. ముందస్తుగా మీరు మీ జీవితాల్లోని ఆర్థిక అవసరాలను, పరిస్థితిని పరిశీలించాలి. హడావుడిగా మరొక లోన్ తీసుకోకండి.మిగిలిన డబ్బుతో తెలివిగా ఇన్వెస్ట్ చేయండి.

Ola Cars: సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​లోకి ఓలా.. ఈఎంఐ, వారంటీ వివరాలు ఇలా..


అదనపు డబ్బును తెలివిగా ఉపయోగించడం
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు మీ వద్దతక్కువ డబ్బులున్నా.. లేక అత్యవసర నిధి లేకపోయినా.. మీరు వెంటనే ఆ నిధిని పెంచుకోవడం లేదా ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టం కనుక అన్ని విషయాల కంటే ముందస్తుగా మీరు సరిపడా డబ్బును రెడీగా ఉంచుకోవాలి. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు అప్పుల వంటి అధిక వడ్డీ రుణాలను వెంటనే తీర్చేయండి. తర్వాత పదవీ విరమణ, పిల్లల భవిష్యత్తు, పెళ్లి కోసం డబ్బు పెంచుకునేందుకు ప్లాన్స్ వేసుకోండి. ఒక్కో ఫైనాన్షియల్ గోల్ కోసం ఎంత దాచుకోవాలో ఒక ప్రణాళిక రూపొందించుకోండి.

Shikhar Dhawan-Aesha: శిఖర్ ధావన్ దంపతులు విడాకులు తీసుకున్నారా..? ఇన్ స్టాగ్రామ్ లో అయేషా పోస్టు వైరల్.. పూర్తి వివరాలివే..

ఉదాహరణకు హోం లోన్ కోసం మీరు ప్రతి నెల రూ.50 వేలు కడుతున్నారు అనుకుందాం. ఈ రుణం కట్టడం పూర్తయిన తర్వాత ప్రతి నెల మీ వద్ద రూ.50 వేలు మిగులుతాయి కదా. అప్పుడు మీరు పిల్లల భవిష్యత్తు కోసం రూ.20,000.. పదవీ విరమణ కోసం రూ.30,000 సేవ్ చేయాలి. మరొక లోన్ తీసుకోవడం కంటే ఇలా భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఇతర ఫైనాన్స్ గోల్స్ కోసం పెట్టుబడి పెట్టడం
పదవీ విరమణ కోసం, మీరు మీ వీపీఎఫ్​/ పీపీఎఫ్(PPF)​లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈక్విటీ ఫండ్‌లను కూడా పెంచుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈక్విటీ, డెబ్ట్ ఫండ్‌(debt funds) లలో చిన్న పొదుపు సమీకరణాలు (SIP) ప్రారంభించొచ్చు. లేదావస్తువులు లేదా వాహనాలు కొనుగోలు వంటి షార్ట్ టర్మ్ గోల్స్​ను నెరవేర్చుకోవచ్చు.

Google Drive: నెట్ అవసరం లేకున్నా గూగుల్ డ్రైవ్ పనిచేస్తుంది.. అదెలా అంటే..


అయితే ఈ గోల్స్ నెరవేర్చుకోవడం కోసం మీరు ముందుగా డబ్బులు ఆదా చేయాలనుకుంటే, డెబ్ట్ ఫండ్స్ (Debt funds) లేదా రికరింగ్ డిపాజిట్‌ (Recurring Deposits) లలో ఇన్వెస్ట్(Invest) చేయండి. ఇలా చేస్తూనే లాంగ్ టర్మ్ గోల్స్ (Long Term Goals) కోసండబ్బు ఆదా చేసేందుకు ప్రయత్నించండి. మీరు ఇటీవల మీ హోమ్ లోన్‌ను తీర్చేసినట్లయితే.. ఎటువంటి ఆలోచన చేయకుండా పెట్టుబడులు పెట్టకండి. మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం అన్ని విషయాలను బేరీజు వేసుకొని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
Published by:Veera Babu
First published: