Home /News /business /

RENAULTS KIGER BECOMES EXPENSIVE THIS CAR BECOMES INDIAS CHEAPEST SUB COMPACT SUV MK

Renault Kiger: పెరిగిన రెనాల్ట్ కిగర్ కారు ధరలు...ఇకపై అతితక్కువ ధరకు లభించే sub-compact SUVగా Nissan Magnite

Renault Kiger (ఫైల్ చిత్రం)

Renault Kiger (ఫైల్ చిత్రం)

Renault Kiger: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు మోడళ్ల ధరలను పెంచింది. రెనాల్ట్ ఈ నెలలో కిగర్ సబ్-కాంపాక్ట్ SUV , ట్రైబర్ MPV ధరలను పెంచింది. దీంతో ఈ రెండు కార్లు దాదాపు 30 వేల రూపాయల వరకు ఖరీదు అయ్యాయి. Renault Kiger ఇప్పటి వరకు దేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే సబ్-కాంపాక్ట్ SUVగా పేరు తెచ్చుకుంది.

ఇంకా చదవండి ...
    Renault Kiger:  ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు మోడళ్ల ధరలను పెంచింది. రెనాల్ట్ ఈ నెలలో కిగర్ సబ్-కాంపాక్ట్ SUV , ట్రైబర్ MPV ధరలను పెంచింది. దీంతో ఈ రెండు కార్లు దాదాపు 30 వేల రూపాయల వరకు ఖరీదు అయ్యాయి. Renault Kiger ఇప్పటి వరకు దేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే సబ్-కాంపాక్ట్ SUVగా పేరు తెచ్చుకుంది. అయితే ధరల పెంపు తర్వాత ఆ స్థానంలో నిస్సాన్ మాగ్నైట్ చేరింది. Renault , అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, Kiger sub-compact SUV ధర ఇప్పుడు దాని ఎంట్రీ-లెవల్ RXE మాన్యువల్ వేరియంట్ ధరను రూ. 5.79 లక్షల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయంచారు. Kiger, బేస్ వేరియంట్ గతంలో రూ. 5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఇప్పుడు దాదాపు రూ.15,000 వరకు పెరిగింది. రెనాల్ట్ గత ఏడాది ఫిబ్రవరిలో Kiger ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు దీని ధర ₹ 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్), అయితే ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు లభించే సబ్-కాంపాక్ట్ SUVగా మారింది. అయితే పెరిగిన ధరల తర్వాత, నిస్సాన్ మాగ్నైట్ రూ. 5.76 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) అత్యంత తక్కువ ధర కలిగిన sub-compact SUV గా మారింది.

    Kiger , 1.0-లీటర్ RXT EASY-R ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ వేరియంట్‌పై గరిష్టంగా రూ. 29,000 ధర పెంచేశారు. ఇప్పుడు దీని ధర రూ. 8.01 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). Kiger సబ్ కాంపాక్ట్ SUV , దాదాపు అన్ని వేరియంట్‌ల ధరలు పెరిగాయి. CVT వేరియంట్‌తో 1.0-లీటర్ RXZ X-ట్రానిక్ టర్బోపై అత్యల్ప ధర రూ. 10,960 పెరిగింది, దీని ధర ఇప్పుడు రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

    Renault Triber ధర 30 వేలు పెరిగింది

    గత ఏడాది జరిగిన గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో Renault Triber ఎమ్‌పివి ఫోర్-స్టార్ రేటింగ్ సాధించింది. ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన 7-సీటర్ మోడల్‌గా పేరు పొందింది. అయితే దీని ధర కూడా బాగా పెరిగింది. ట్రైబర్ కొన్ని వేరియంట్లపై దాదాపు రూ. 30,000 పెరిగింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Cars

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు