కార్ల తయారీ కంపెనీలు ఫెస్టివల్ సీజన్ సందర్భంగా తమ కార్లపై డిస్కౌంట్స్ (Car Discounts) ప్రకటిస్తూ, కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించాయి. ఇప్పటికే హోండా కార్స్ ఇండియా ఈ పండుగ సీజన్ కోసం రూ.39,298 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ దీపావళికి హ్యుందాయ్ తన కార్లపై రూ. 1 లక్ష వరకు ఆఫర్లు & డిస్కౌంట్స్ అనౌన్స్ చేసింది. కాగా తాజాగా ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్/రెనో (Renault) కూడా తన క్విడ్, ట్రైబర్, కైగర్ వాహనాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో పండుగ సీజన్ కొనసాగుతుండగా ఈ ఫ్రెంచ్ కార్‌మేకర్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో రూ.50,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్రయోజనాలు అక్టోబర్ 31 లోపు అందుబాటులో ఉంటాయి.
రెనాల్ట్ కైగర్
రెనాల్ట్ కైగర్ మోడల్‌పై కంపెనీ ఎలాంటి క్యాష్ డిస్కౌంట్స్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఆఫర్ చేయట్లేదు. కానీ సబ్-4 మీటర్ ఎస్యూవీ అయిన రెనాల్ట్ కైగర్ కొనుగోలు చేసేవారు కార్పోరేట్ డిస్కౌంట్‌గా రూ.10,000 బెనిఫిట్స్ అందుకోవచ్చు. రెనాల్ట్ కైగర్కి 2022 ప్రారంభంలో ఒక అప్డేట్ను కంపెనీ ఆఫర్ చేసింది. ఈ SUV మారుతి సుజుకి, నిస్సాన్, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీల వాహనాల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.
Honda Offer: ఈ కార్లు ఇప్పుడు కొనండి.. డబ్బులు వచ్చే ఏడాది కట్టండి.. హోండా ధమాకా ఆఫర్..!
రెనాల్ట్ ట్రైబర్
దీనిపై అక్టోబర్‌లో రూ.50 వేల వరకు బెనిఫిట్స్‌ను కొనుగోలుదారులను అందుకోవచ్చు. ఇందులో రూ.15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న ఏకైక సబ్-4 మీటర్ MPV రెనాల్ట్ ట్రైబర్. ఈ మల్టీ పర్పస్ వెహికల్ లిమిటెడ్ ఎడిషన్‌పై రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ సహా మొత్తం రూ.45 వేల ఆఫర్లను అందుకోవచ్చు.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ 2019లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇటీవల రిఫ్రెష్డ్ మారుతి సుజుకి ఆల్టో వెర్షన్‌తో నేరుగా పోటీపడుతుంది. రెనాల్ట్ క్విడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌తో లాంచ్ అయింది. రెనాల్ట్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు క్విడ్ ఈ నెలలో రూ.35,000 డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఇందులో రూ.10 వేల క్యాష్ బెనిఫిట్స్, 1.0-లీటర్ వేరియంట్‌కి రూ.15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.800 సీసీ వెర్షన్‌కి రూ.10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Latest offers, New cars, Renault