హోమ్ /వార్తలు /బిజినెస్ /

Renault Special Edition: రెనో ట్రైబర్ స్పెషల్ ఎడిషన్ కారు విడుదల.. ధర, ఫీచర్స్ వివరాలివే..

Renault Special Edition: రెనో ట్రైబర్ స్పెషల్ ఎడిషన్ కారు విడుదల.. ధర, ఫీచర్స్ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో భారత మార్కెట్లోకి ట్రైబర్ మోడల్ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసింది. కాంపాక్ట్ మల్టీపర్పస్ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తున్న రెనో ట్రైబర్ స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో భారత మార్కెట్లోకి ట్రైబర్ మోడల్ స్పెషల్(Special) ఎడిషన్ ను విడుదల చేసింది. కాంపాక్ట్ మల్టీపర్పస్ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తున్న రెనో ట్రైబర్ స్పెషల్(Tribal Special) ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. భారత్ లో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినందున ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను కార్ లవర్స్ కి అందిస్తున్నట్లు తెలిపింది. దీని ధర రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మూన్‌లైట్ సిల్వర్, సెడార్ బ్రౌన్(Brown) వంటి రెండు కొత్త రంగుల్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదల కానుంది.

సేఫ్టీతో పాటు, సౌకర్యానికి ప్రాధాన్యతనిచ్చే బెస్ట్-ఇన్-క్లాస్ డిజైన్‌, టెక్నాలజీతో దీనిని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. సెల్ఫ్ కంట్రోల్ ట్విన్ ఏసీని కూడా అందిస్తోంది. వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. మాన్యువల్ తో పాటు.. ఈజీ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. ఇక ఇతర ఫీచర్ల వివరాల్లోకి వస్తే.. స్టీరింగ్ మౌంటెడ్, ఫోన్ కంట్రోల్ ఆడియో సిస్టమ్ ఉంది. ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అదనపు ఫీచర్లున్నాయి. ట్రైబర్.. గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్(ఎన్‌సీఏపీ) ప్రమాణాల ప్రకారం 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ సర్ఠిఫికెట్ ను పొందిందని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి : ముద్దు భారత్ లోనే పుట్టిందా..? ఆ తర్వాత మన దగ్గర నుంచి ప్రపంచం నేర్చుకుందా..?

2019లో ప్రారంభించిన రెనో-ట్రైబర్ దేశవ్యాప్తంగా తమ బ్రాండ్ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం భావిస్తోంది. భారత్- ఫ్రాన్స్‌ దేశాల మధ్య జరిగిన ఉమ్మడి ఒప్పందంలో భాగంగా రెనో ట్రైబర్ రూపొందింది. భారత మార్కెట్‌లో వినూత్న ఉత్పత్తుల అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

 బీఎండబ్ల్యూ డీజిల్ వెర్షన్ గ్రాండ్ లాంఛ్..

మరోవైపు జర్మనీకి చెందిన లగ్జరీ(Luxury)కార్ల తయారీ సంస్థ BMW తాజాగా తన పాపులర్​ X3 మోడల్​ను రిఫ్రెష్​ చేసింది. గురువారం కొత్త ఎక్స్ 3 ఎస్​యూవీ డీజిల్(Diesel) వేరియంట్‌ను విడుదల చేసింది. మొదట ఇది కేవలం పెట్రోల్(Petrol)​ ఇంజిన్​తో మాత్రమే విడుదలైంది. తాజా లాంచింగ్​తో ఇకపై డీజిల్​ ఇంజిన్​లోనూ లభించనుంది. దీనితో.. రెండు పెట్రోల్​ వేరియంట్లతో పాటు ఒక డీజిల్​ వేరియంట్ మార్కెట్​లో అందుబాటులో ఉంటాయి. ఈ లేటెస్ట్​ లగ్జరీ కారు మోడల్​ స్థానికంగా చెన్నైలోని(Chennai) బీఎండబ్ల్యూ ప్లాంట్​లో తయారైంది.

SkyDive: హైదరాబాద్‌లో స్కైడైవింగ్‌ చేసే అవకాశం.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ అందుబాటులోకి..!


ఇది పెట్రోల్​ ట్రిమ్​తో పాటే దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ డీలర్​షిప్​ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. ధరల పరంగా చూస్తే.. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​3 xDrive20d ట్రిమ్​ వేరియంట్​ రూ. 65.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక, xDrive30i స్పోర్ట్స్​ ఎక్స్​ ప్లస్​ ట్రిమ్​ దర రూ. 59.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

First published:

Tags: Business, New cars, Renault