బిజినెస్

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Renault Cars: రెనాల్ట్ కార్లపై రూ.49,000 వరకు తగ్గింపు... దీపావళి ఆఫర్

Renault Cars Diwali Offer | దీపావళి సందర్భంగా కారు కొనాలనుకుంటున్నారా? రెనాల్ట్ బ్రాండ్ కార్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 3, 2020, 3:13 PM IST
Renault Cars: రెనాల్ట్ కార్లపై రూ.49,000 వరకు తగ్గింపు... దీపావళి ఆఫర్
Renault Cars: రెనాల్ట్ కార్లపై రూ.49,000 వరకు తగ్గింపు... దీపావళి ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆటోమొబైల్ ఇండస్ట్రీపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. లాక్‌డౌన్ కారణంగా ఈ సంవత్సరం మార్చి నుంచి కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ పండుగ సీజన్ ఈ రంగానికి ఉత్తేజాన్నిచ్చింది. గత రెండు నెలలుగా అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో కార్ల తయారీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తున్న సంస్థలు తమ పోర్ట్‌ఫోలియోకు కొత్త వాహనాలను జోడిస్తూ, వాటిపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఈ జాబితాలో రెనాల్ట్ కూడా చేరింది. రెనాల్ట్ డస్టర్, ట్రైబర్, క్విడ్ మోడళ్ల కొనుగోలుపై కస్టమర్లు లక్ష రూపాయల వరకు లాభదాయకమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నెలలో రెనాల్ట్ కార్లపై కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్లు, తగ్గింపుల వివరాలు...

Renault Kwid: సంస్థ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన క్విడ్ కారుపై రూ.49,000 వరకు తగ్గింపును వినియోగదారులు పొందవచ్చు. ఇందులో రూ.15,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ10,000 వరకు లాయల్టీ బెనిఫిట్, రూ.9,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. క్విడ్ కొనుగోలుపై లోన్ తీసుకోవాలనుకుంటే.. రూ.2.2 లక్షలపై 12 నెలల గడువు వరకు 3.99 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు. గ్రామీణ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

Jan Dhan account: జన్ ధన్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్

EPFO: వాట్సప్‌లో ఈపీఎఫ్ఓ హెల్ప్‌లైన్... హైదరాబాద్, విజయవాడ నెంబర్స్ ఇవే

Renault Triber: రెనాల్ట్ నుంచి వచ్చిన సబ్ కాంపాక్ట్ సెవెన్ సీటర్ వాహనమైన ట్రైబర్ కొనుగోలుపై రూ.39,000 వరకు ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు. ఇందులో ఎక్చ్సేంజ్ బెనిఫిట్ రూ.20,000, రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు రూ.9,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ వినియోగదారులు రూ.5,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. క్విడ్ మాదిరిగానే ట్రైబర్ కారుపై కూడా 3.99 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 12 నెలల గడువుతో రూ.3.86 లక్షల వరకు ఉండే లోన్‌పై ఈ వడ్డీరేట్లు ఉంటాయి.

Renault Duster 1.5-litre: ఈ ఎస్‌యూవీ కొనుగోలుపై రూ.1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.50,000 వరకు క్యాష్‌ బెనిఫిట్స్, రూ.20,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో పాటు వినియోగదారులు రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. గ్రామీణ వినియోగదారులు అదనంగా రూ.15,000 వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

Oneplus 7T: రూ.39,999 విలువైన స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనండి ఇలా

SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా

Renault Duster Turbo: రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై రూ.45,000 వరకు ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. అదనంగా రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవీపై మూడు సంవత్సరాల వరకు లేదా 50,000 కిలోమీటర్లు తిరిగే వరకు ఈజీ కేర్ ప్యాకేజీని వినియోగదారులు పొందవచ్చు. గ్రామీణ వినియోగదారులు అదనంగా రూ.15,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: November 3, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading