Renault KWID: జస్ట్ నెలకు రూ.3500 ఉంటే చాలు..కొత్త కారు మీ సొంతం..ఎలాగంటే..

ప్రముఖ కార్ల కంపెనీ రెనో తన ఎంట్రీ లెవెల్ రెనో క్విడ్ కార్ పై బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. దీంతో మీకు అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్ తో ఈ కార్ ను సొంతం చేసుకోవచ్చు.

ప్రముఖ కార్ల కంపెనీ రెనో తన ఎంట్రీ లెవెల్ రెనో క్విడ్ కార్ పై బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. దీంతో మీకు అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్ తో ఈ కార్ ను సొంతం చేసుకోవచ్చు.

  • Share this:
    ప్రస్తుత కరోనా కారణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడితే చాలా ప్రమాదకరం. దీంతో ప్రతీ ఒక్కరూ తమ సొంత వాహనాలు వాడేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డైలీ ఆఫీసుల కి , పలు అవసరాల కోసం కార్లు నిత్య అవసరంగా మారిపోయాయి. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న.. కార్ల అమ్మకాలు కూడా ఢమాల్ అయ్యాయి. దీంతో కార్ల కంపెనీలు తమ సేల్స్ పెంచుకునేందుకు బోలెడు ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. అయితే మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. అది కూడా తక్కువ ఈఎంఐ పెట్టుకునే సదుపాయం కూడా కావాలా.. అయితే మీ కోసమే రెనో కంపెనీ సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది..!! ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..ఉన్నాయి.

    ప్రముఖ కార్ల కంపెనీ రెనో తన ఎంట్రీ లెవెల్ రెనో క్విడ్ కార్ పై బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. దీంతో మీకు అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్ తో ఈ కార్ ను సొంతం చేసుకోవచ్చు.. కంపెనీ ఈఎంఐ క్యాలికులేటర్ ప్రకారం.. మీరు నెలకు జస్ట్ రూ.3618 చెల్లించి కడితే చాలు మీరు కారును సొంతం చేసుకోవచ్చు. కొత్తగా కార్ కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. రెనో క్విడ్ ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.3.18 లక్షలుగా ఉంది. రెనో క్విడ్ కార్ లో రెండు వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి. 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ కార్ లీటర్ కు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది..

    ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే... మిగిలిన 2.18 లక్షల మొత్తానికి బ్యాంక్ లోన్ తీసుకోవాలి. మీరు 84నెలలు టెన్యుర్ తో లోన్ తీసుకుంటే మీకు నెలకు రూ.3618 ఈఎంఐ కట్టాలి. ఇంకా ఈఎంఐ ప్రొటెక్షన్ ప్లాన్, జాబ్ లాస్ కవర్ వంటి ఇన్సూరెన్స్ ప్యాక్స్ ను కూడా అందిస్తోంది..
    Published by:Krishna Adithya
    First published: