RENAULT INDIA CARS OFFERS DISCOUNTS ON DIFFERENT MODELS CHECK FOR FULL DETAILS BA
Renault Car Discounts: కారు కొనాలంటే కరెక్ట్ టైమ్.. భారీ డిస్కౌంట్, పండుగ చేసుకునే రేంజ్లో
Renault Cars: రెనాల్ట్ కార్లపై రూ.60,000 వరకు తగ్గింపు
(ప్రతీకాత్మక చిత్రం)
కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్. అయ్యో 2020 డిసెంబర్లో చాలా కంపెనీలు కార్ల మీద భారీ నుంచి అతి భారీ ఆఫర్లు ప్రకటించాయో, కారు కొనులేకపోయామే అని ఆలోచించే వారికి ఇప్పుడు గుడ్ న్యూస్. 2021 నుంచి కార్ల కంపెనీలు ధరలను పెంచాయి. అయితే, తాజాగా రెనాల్ట్ ఇండియా కొత్త ఏడాది, పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్. అయ్యో 2020 డిసెంబర్లో చాలా కంపెనీలు కార్ల మీద భారీ నుంచి అతి భారీ ఆఫర్లు ప్రకటించాయో, కారు కొనులేకపోయామే అని ఆలోచించే వారికి ఇప్పుడు గుడ్ న్యూస్. 2021 నుంచి కార్ల కంపెనీలు ధరలను పెంచాయి. అయితే, తాజాగా రెనాల్ట్ ఇండియా కొత్త ఏడాది, పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రెనాల్ట్ గత ఏడాది రూ.70,000 వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఏడాది కొంచెం తగ్గించింది. అయితే, కార్లు ధరలు పెరిగాయి కాబట్టి ఓ రకంగా మంచి ఆఫర్ లభించినట్టే చెప్పుకోవాలి. ఈ ఆఫర్లు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు లభిస్తాయి. రెనాల్ట్ క్విడ్ 2020లో రూ.2.98 లక్షల నుంచి ప్రారంభమైతే, ఈ సంవత్సరం రూ.3.13 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మొత్తం మూడు కార్ల మీద ఆఫర్ అందిస్తుంది. Renault Triber, Duster, Kwid మీద ఆఫర్ ఇస్తోంది. కస్టమర్లు నేరుగా షోరూమ్‌కి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. లేదా, ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నా కూడా డిస్కౌంట్ లభిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి అదనంగా మరో రూ.15,000 వరకు ఇన్సెంటిట్ లభిస్తుంది. అయితే, 2020లో తయారు చేసిన కార్ల మీద ఈ ఆఫర్ వస్తుంది.
Renault Kwid Offer
క్యాష్ డిస్కౌంట్ రూ.20,000
ఎక్సేంజ్ రూ.10,000
క్విడ్ మ్యాన్యువల్ మీద రూ.15,000
కార్పొరేట్ కస్టమర్లకు రూ.10,000
గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు రూ.5000
Renault Duster
లాయల్టీ రూ.15,000
ఎక్సేంజ్ బోనస్ రూ.30,000
కార్పొరేట్ డిస్కౌంట్ రూ.30,000
గ్రామీణ ప్రాంతాల కస్టమర్లకు రూ.15000
Renault Triber
క్యాష్ బెనిఫిట్ రూ.20,000 (AMT వెర్షన్ మీద)
డీలర్ షిప్ ప్రత్యేక ఆఫర్ రూ.10,000 (RXL/RXT/RXZ మోడల్స్ మీద)
ఎక్సేంజ్ బోనస్ రూ.30,000
హ్యుందయ్ నుంచి కొత్త కారు
ఇక హ్యుందాయ్ సంస్థ నుండి మరో కొత్త ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. అయోనిక్ 5 మిడ్ సైజ్ సీయూవీ పేరుతో జనాలకు అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త కారుకి ఎన్నో వైవిధ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. అయోనిక్ పేరుతో ఇప్పటికే కొన్ని బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) చెలామణీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ లైన్ అప్ బ్రాండ్స్ నుండి వస్తున్న మొదటి మోడల్ "అయోనిక్ 5". రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్లను రూపొందించడంలో కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అయోనిక్ 5 కూడా అలాంటిదే. హ్యుందాయ్ సంస్థ ఇప్పటికే Electric Global Modular Platform అనగా - ప్రపంచ వ్యాపంగా విద్యుత్ వాహనాల మోడల్స్‌ను రూపకల్పన చేసే వేదికను స్వయంగా ఏర్పాటు చేసుకుంది. అయోనిక్ 5 కూడా ఇదే వేదిక నుండి తయారైన తొలి ఎలక్ట్రిక్ వాహనంగా కితాబునందుకుంది.
అయోనిక్ 5 డిజైన్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. తయారీదారులు చాలా సృజనాత్మకతో ఈ డిజైన్‌ను రూపొందించారు. ముఖ్యంగా పిక్సల్స్‌ను ప్రేరణగా తీసుకొని తయారుచేసిన హెడ్ లైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటోమొబైల్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ఆవశ్యకతను గురించి ఇది కచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే క్లామ్ షెల్ (కారు పై భాగం నుండి తెరుచుకొనే తలుపు) మొత్తం కారు వెడల్పును చుట్టేసుకొని ఉండే విధంగా దీనిని రూపొందించారు. ఈ ప్రత్యేకత కలిగిన తొలి హ్యుందాయ్ వాహనంగా అయోనిక్ 5 ను పేర్కొనవచ్చు. అలాగే ఈ కారు ముఖ భాగం మొత్తం డిజిటల్ సైడ్ మిర్రర్స్‌తో పాటు గ్రిల్స్‌తో కప్పేయబడి ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.