హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Discount Offer: దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ!

Car Discount Offer: దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ!

 దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ!

దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ!

Renault Offer | మీరు కొత్తగా కారు కొనే యోచనలో ఉంటే మాత్రం మీరు ఇదే సరైన సమయం. ఎందుకని అనుకుంటున్నారా? కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఏకంగా అర లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Car Offers | దసరా పండుగ వచ్చేసింది. ఇక దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగ సీజన్‌లో మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీకు అదిరిపోయే శుభవార్త. ఎందుకి అనుకుంటున్నారా? కార్లపై ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. పలు రకాల కార్ల (Car) కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు రెనో (Renault) కంపెనీ కూడా తన కార్లపై డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది.

    రెనో కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ ఏకంగా రూ. 50 వేల తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు ప్రయోజనం ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కారు మోడళ్లపై ఈ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. కాగా డీలర్‌షిప్, ప్రాంతం, వేరియంట్ ప్రాతిపదికన ఆఫర్లలో మార్పులు ఉండొచ్చు. అందువల్ల మీకు దగ్గరిలోని డీలర్‌షిప్ వద్దకు వెళ్లి ఆఫర్ వివరాలు తెలుసుకోవచ్చు.

    బ్యాంక్, పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. చేరితే రూ.40 లక్షలు పొందొచ్చు!

    రెనో ట్రైబర్ కారుపై గరిష్టంగా రూ. 50 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 15 వేల వరకు ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 25 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ. 10 వేల వరకు తగ్గింపు వస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. రైతులు, సర్పంచ్‌లు, గ్రామ పంచాయితీ సభ్యులకు అదనంగా రూ. 5 వేలు తగ్గింపు వస్తుంది.

    భారీ షాక్.. రూ.2,000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్!

    రెనో క్విడ్ కారుపై కూడా ఆఫర్ ఉంది. ఎంట్రీ లెవెల్ కారు అయిన ఈ మోడల్‌పై రూ. 35 వేల వరకు తగ్గింపు ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు ఉంది. ఎక్స్చేంజ్ బెనిఫిట్ కింద రూ. 15 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై కూడా రూరల్ ఆఫర్ ఉంది.

    రెనో కైగర్ కారుపై కూడా డిస్కౌంట్ ఉంది. క్విడ్, ట్రైబర్ కార్ల మాదిరిగానే ఈ కారుపై కూడా కార్పొరేట్ డిస్కౌంట్, రూరల్ ఆఫర్ వంటివి ఉన్నాయి. అయితే ఈ మోడల్‌పై మాత్రం క్యాష్ డిస్కౌంట్ లేదు. కారు కొనాలని చూసే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర కంపెనీల కార్లపై కూడా తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Cars, Discounts, Latest offers, Offers, Renault

    ఉత్తమ కథలు